ETV Bharat / city

Plantation సరికొత్త ఆలోచనలతో మొక్కల పెంపకం

author img

By

Published : Aug 22, 2022, 2:10 PM IST

Plantation మొక్కల పెంపకం, పూల సోయగం కళాత్మక జోడింపు,  సాగులో ఆధునిక ప్రయోగాలుచెరువుల్లోంచి నీటి తొట్టెలోకి చేరిన తామర పూలు అక్కడ కనువిందు చేస్తున్నాయి. పంటపొలాల్లో పెరిగే ఆకుకూరలు కాస్త భవనాల్లో కరెంట్‌ వెలుగుల్లో పెరుగుతున్న తీరు కొత్తవారికి ఆశ్చర్యం కల్గించక మానదు. సీసా అందులో మట్టి, పెరిగే మొక్క అయితే ఏం ప్రత్యేకత ఉంటుంది. అందుకే సీసాలకు రంగులద్ది వాటిపై సృజనాత్మకత ఉట్టిపడేలా చేస్తున్నారు. ఒక మొక్క ఆకు తెంపి నోట్లో వేసుకుంటే చెరుకు గడలా తియ్యగా ఉంటే అది చెప్పలేని మధురానుభూతి.

Planting
మెుక్కల పెంపకం

Plantation : గాజు సీసాల్లో ఇండోర్‌ మొక్కలను పెంచుకోవడం, దానికి అందమైన ఆర్ట్‌ను జోడిస్తే ఇంకా కళాత్మకంగా అగుపిస్తాయి. మొక్కల ప్రియులను నెక్లెస్‌ రోడ్డులో జరుగుతున్న నర్సరీ మేళాలో ఇలాంటి ఎన్నో విశేషాలు ఆకట్టకుంటున్నాయి. కొన్ని వందల రకాల మొక్కలు ఇక్కడ కొలువుదీరాయి. ఇంటిబయట, మేడ మీద, ఎక్కడా చోటు లేకపోతే ఇంట్లోనే పెంచుకోతగ్గ దేశీ, విదేశీ రకాల మొక్కలు విరబూసిన పూలతో సందడి చేస్తున్నాయి.

తొట్టెలో పెంచుకునేలా..

.

తామరపూలు చెరువుల్లో ఎక్కువగా చూస్తుంటాం. పైగా ఇవి అన్ని చోట్ల కూడ కన్పించవు. నగరంలో అయితే ఇంకా కష్టం. వీటిని ఇంట్లో నీటి తొట్టెలో పెంచుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల నుంచి ప్రధానంగా థాయిలాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న తామరపూల రకాలను నర్సరీల్లో పెంచి నీటి తొట్టెల్లో పెట్టి విక్రయిస్తున్నారు. కంటైనర్‌తోపాటూ వీటిని విక్రయిస్తున్నారు. ఇంటి ముంగిట, బాల్కనీల్లో పెంచుకోవచ్చు. నీరు తగ్గినప్పుడల్లా నింపితే చాలు పూలు పూస్తూనే ఉంటాయని నర్సరీ నిర్వాహకులు అంటున్నారు .

ఆకు ఎంత తీయన...

.

మొక్కల ఆకులు ఎక్కువగా వగరు, చేదు ఉంటాయి. ఔషధ గుణాలు ఉండటం వల్ల వాటిని నోట్లో వేసుకుని నమలుతుంటాం. తీయని ఆకును ఎప్పుడైనా తిన్నారా? స్టీవియో మొక్క ఆకు నమిలితే ఎంత తీయగా ఉంటుందటే తేనీరులో చక్కెరకు బదులుగా ఈ మొక్క ఆకులను వేసుకుని తాగొచ్చు అని ఈ అరుదైన మొక్కల నర్సరీ నిర్వాహకులు ఆనంద్‌ అంటున్నారు.

హైడ్రో పొనిక్స్‌...

.

కుకూరలు తినాలంటే నగరవాసులు భయపడుతుంటారు. మూసీ పరివాహకంలో కాలుష్య నీటిలో వీటిని పండిస్తున్నారనే భయాలు ఉన్నాయి. మట్టి లేకుండా, పొలం లేకుండా కూడా ఆకుకూరలు సాగు చేసే విధానం సిటీలో పెద్ద ఎత్తున సాగుతోంది. నర్సరీ మేళాలో వీటికి సంబంధించి మూడు స్టాళ్ల వరకు ఏర్పాటయ్యాయి. ఆకుకూరలు పెరగడానికి అవసరమైన పోషకాలను నీటిలోనే కలిపి మొక్కకు అందజేసే హైడ్రోపోనిక్స్‌ విధానాన్ని ఎక్కువ మంది అవలంభిస్తున్నారు. సూర్యరశ్మి కోసం విద్యుత్తు బల్బులను ఉపయోగిస్తున్నారు. ఇంట్లో బాల్కనీల్లోనూ వీటిని పెంచుకోవచ్చు.

సీసాల్లో కళాత్మకంగా...

.

సీసా అందులో మట్టి, పెరిగే మొక్క అయితే ఏం ప్రత్యేకత ఉంటుంది.. అందుకే సీసాలకు రంగులద్ది వాటిపై సృజనాత్మకత ఉట్టిపడేలా పేయింటింగ్స్‌తోసహా తీర్చిదిద్దుతున్నారు. బాల్కనీల్లో, ఇంట్లో ఎండ నేరుగా తగలని ప్రదేశాల్లో పెంచుకుని ఆహ్లాదాన్ని పొందుతున్నారు. స్పైరల్‌ బాంబూ మొక్క, మినీ ప్లామ్‌ మొక్కలు, షాండిలీయర్‌, అలోవీరా, అంబరిల్లా మొక్క, ఫైకస్‌ మొక్కలను పెంచుకుంటున్నారు. ఆసక్తి కొద్ది మొదలైన ఈ ఆలోచన అంకుర సంస్థ ఏర్పాటుతో మరిన్ని ఎక్కువ ఇళ్లలో విస్తరించేందుకు దారి తీసిందని ప్లాంట్‌ దర్బార్‌ వ్యవస్థాపకులు యూసుఫ్‌ గారరీ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.