ETV Bharat / city

pawan kalyan: కేటీఆర్​ సవాల్​ను స్వీకరించిన పవన్‌.. ట్విట్టర్​లో ఫొటోలు..

author img

By

Published : Aug 7, 2022, 2:21 PM IST

PAWAN KALYAN: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్​ను జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ స్వీకరించారు. చేనేత వస్త్రాలు ధరించిన పవన్​.. వాటికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

pawan kalyan
pawan kalyan

PAWAN KALYAN: జాతీయ చేనేత దినోత్సవం సందర్భగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్​కల్యాణ్​ స్వీకరించారు. చేనేత వస్త్రాలు ధరించాలంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెండూల్కర్‌తో పాటు పవన్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ ‘చేనేత’ సవాల్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు.

ఇవీ చదవండి:

ఆర్జీయూకేటీ విద్యార్థులు అసహనంతో ఉన్నారు: గవర్నర్ తమిళిసై

ఎద్దులు హల్​చల్.. ఘర్షణ పడి బైక్​ను ఢీ.. దూసుకొచ్చిన కారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.