ETV Bharat / city

ఉగాది పండుగ..శ్రీవారి సన్నిధి ముస్తాబు

author img

By

Published : Apr 13, 2021, 5:00 AM IST

తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది పండుగను వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీవారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు మెుదలవుతాయి.

tirumala temple news, tirumala ugadhi festival news
ఉగాది పండుగ..శ్రీవారి సన్నిధి ముస్తాబు

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేళ... తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయంతోపాటు ప‌రిస‌రాలను ఫ‌ల, పుష్పాల‌తో అందంగా అలంక‌రించారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీవారి సుప్రభాత సేవతో కార్యక్రమాలు మెుదలవుతాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరుమల నాలుగు మాడవీధుల్లో ఉభయ దేవరుల సమేతంగా శ్రీ మలయప్ప స్వామి బంగారు పల్లకిపై ఊరేగుతూ..భక్తకోటికి అనుగ్రహించనున్నారు.

ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని తితిదే ఉద్యాన‌వ‌న విభాగం రంగురంగుల పుష్పాలతో అలంకరించింది. 8 టన్నుల పువ్వులు, 70 వేల‌ కట్ ఫ్లవ‌ర్స్‌ ఉపయోగించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిపుణులైన కళాకారులు.... పుష్పాలంకరణలో పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా తితిదే శ్రీవారి ఆర్జీత సేవలను మంగళవారం రద్దు చేసింది.

ఇదీ చదవండి: నేటి నుంచి రామయ్య సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.