ETV Bharat / city

నిర్వహణ లోపాలు అగ్నిప్రమాదానికి కారణమే: అగ్నిమాపక నిపుణులు

author img

By

Published : Aug 9, 2020, 7:31 PM IST

నేషనల్​ బిల్డింగ్​ కోడ్​ (ఎన్​బీసీ) నియమావళిని కచ్చితంగా పాటిస్తే బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు జరగవని ఎన్​బీసీ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్​ తెలిపారు. ఒక అవసరానికి నిర్మించిన భవనాన్ని మరొకదానికి వినియోగించడం వల్లనూ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

nbc member srinivas on fire accidents
నిర్వహణ లోపాలు అగ్నిప్రమాదానికి కారణమే: అగ్నిమాపక నిపుణులు

నేషనల్​ బిల్డింగ్​ కోడ్​ నియమావళిని కచ్చితంగా పాటించి, నిర్వహణ లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవించవని ఎన్‌బీసీ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఎత్తైన భవనాలు నిర్మించే సమయంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా ఒక అవసరానికి నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని.. మరొక దానికి వినియోగించడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిర్వహణకు అనుగుణంగా మార్పులు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు.

భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి.. నిర్మాణం పూర్తయ్యే వరకు అగ్నిమాపక నిపుణుడి పర్యవేక్షణలో అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక నిపుణుడు, నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ కమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి తిరుపాల్​రెడ్డితో ప్రత్యేక ముఖాముఖి..

నిర్వహణ లోపాలు అగ్నిప్రమాదానికి కారణమే: అగ్నిమాపక నిపుణులు

ఇవీచూడండి: తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.