ETV Bharat / city

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బయోమాస్‌ వినియోగంపై జాతీయ మిషన్

author img

By

Published : May 26, 2021, 10:02 AM IST

National Mission
బయోమాస్‌ వినియోగంపై జాతీయ మిషన్

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బయోమాస్‌ వినియోగంపై అధ్యయనానికి జాతీయ మిషన్‌ ఏర్పాటైంది. విద్యుత్తు ఉత్పత్తిలో కర్బన ఉద్గారాలు తగ్గించటం, వాతావరణంలో కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్‌ మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గుతో కలిపి వ్యవసాయ వ్యర్థాలను కలిపి మండించే అంశంపై ఈ మిషన్‌ పనిచేస్తుంది.

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బయోమాస్‌ వినియోగంపై అధ్యయనానికి జాతీయ మిషన్‌ ఏర్పాటైంది. విద్యుత్తు ఉత్పత్తిలో కర్బన ఉద్గారాలను తగ్గించటం, అదే సమయంలో వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయటం వల్ల తలెత్తే కాలుష్యాన్ని నివారించటం తదితర సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఈ మిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గుతో కలిపి వ్యవసాయ వ్యర్థాలను కలిపి మండించే అంశంపై ఈ మిషన్‌ పనిచేస్తుంది.

మిషన్‌లో భాగంగా స్టీరింగ్‌ కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, అనుబంధంగా మూడు సబ్‌గ్రూపులు ఏర్పాటు కానున్నాయి. స్టీరింగ్‌ కమిటీకి విద్యుత్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి నాయకత్వం వహిస్తారు. పెట్రోలియం, సహజవాయువు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖలు భాగస్వాములవుతాయి. ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) సభ్యుడు నాయకత్వం వహిస్తారు. ఈ ప్రాజెక్టు అమలులో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర బాధ్యతలను ఎన్టీపీసీ చేపడుతుంది. మూడు సబ్‌గ్రూపుల్లో ఒకటి.. బయోమాస్‌ లక్షణాలు, వినియోగం తదితర అంశాలను పర్యవేక్షిస్తుంది. మరో బృందం.. వ్యవసాయ వ్యర్థాలను బొగ్గుతో కలిపి బాయిలర్లలో మండించేటప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా, బాయిలర్‌ డిజైన్‌ ఇతర సాంకేతిక అంశాలను పరిశీలిస్తుంది. కార్యక్రమంపై అవగాహన పెంచటం, ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రాజెక్టు కొనసాగటానికి అవసరమైన చర్యలపై మూడో బృందం పనిచేస్తుంది.

ఇదీ చూడండి: కమలనాథుల వరుసమంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల​ మొగ్గు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.