ETV Bharat / city

Congress: 'తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ లేదు.. పోట్లాడే స్వేచ్ఛ లేదు'

author img

By

Published : Aug 10, 2021, 6:01 PM IST

seethakka
సీతక్క

పోడు భూములకు పట్టాలివ్వాల్సిందేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్​ చేశారు. నిన్న ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు.

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ సభకు సహకరించిన సీనియర్​ నేత ప్రేమ్​సాగర్​, నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్​ కార్యకర్తలు, అదివాసీ, ఎస్సీ సంఘాలకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. ఎలక్షన్​ వస్తేనో, ఏదైనా సభ పెడితేనో తప్ప తెరాసకు ప్రజా సమస్యలు గుర్తుకురావని అన్నారు. హుజూరాబాద్​ ఉపఎన్నిక వస్తే దళిత బంధు గుర్తుకు వచ్చింది. ఇంద్రవెళ్లి సభ పెడితే పోడు భూములు గుర్తుకు వచ్చాయి. కేసీఆర్​ అబద్ధలు చెబుతున్నారని అన్నారు.

పోడు భూములకు పట్టాలివ్వాలని, రైతు బంధు ఇవ్వాలని గత కొంత కాలంగా కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోంది. పోడు భూములకు కాంగ్రెస్​ హక్కులు కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరికి పట్టాలు ఇవ్వకుండా.. ఉన్న భూమిని లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్​ది అని విమర్శించారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు. రైతు బంధు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలని సీతక్క కోరారు.

ప్రజలకు ఎక్కడ ఇబ్బందులుంటాయో అక్కడ లక్షలాది మంది తరలి వస్తారని అనడానికి ఇంద్రవెళ్లి సభ పెద్ద ఉదాహరణ. ఈ రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. నిలదీసే స్వేచ్ఛ లేదు. పత్రికలు, మీడియాకు వాస్తవాలను చూపించే స్వేచ్ఛ లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సభలు గర్జిస్తాయి. ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాడుతాం

-సీతక్క, ములుగు ఎమ్మెల్యే

పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే: సీతక్క

ఇదీ చదవండి: TRS: 'నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.