ETV Bharat / city

'లబ్ధి పొందారు.. నన్ను ఆశీర్వదించకపోతే మీకు పాపం తగుల్తది..'

author img

By

Published : Aug 2, 2022, 7:53 PM IST

MINISTER SIDIRI: ఏపీలో 'గడప-గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులకు అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి.. కొన్నిచోట్ల నాయకులు సర్దిచెప్పి ముందుకెళ్తుండగా.. మరికొన్నిచోట్ల ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు తెదేపా పార్టీకి చెందినవాళ్లు కదా.. మీకెందుకు పనులు చేయాలని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఆ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓ మహిళకు శాపనార్ధాలు పెట్టారు. ఎందుకంటే..!

minister-sidiri-appalaraju-participated-in-gadapa-gadapa-program-in-srikakulam-district
minister-sidiri-appalaraju-participated-in-gadapa-gadapa-program-in-srikakulam-district

'లబ్ధి పొందారు.. నన్ను ఆశీర్వదించకపోతే మీకు పాపం తగుల్తది..'

MINISTER APPLARAJU: ప్రభుత్వం నుంచి చాలా లబ్ధి పొందారని.. ఈసారి తనను ఆశీర్వదించకపోతే పాపం తగులుతుందని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సాయం గురించి ప్రజలకు వివరించారు. ఆ క్రమంలోనే.. ప్రభుత్వం నుంచి చాలా పథకాల ద్వారా లబ్ధి పొందారని.. ఈసారి తనను ఆశీర్వదించాలన్నారు.. లేకుంటే పాపం తగులుతుందని ఓ మహిళకు శాపనార్థాలు పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.