ETV Bharat / city

'దేశచరిత్రలోనే కనీవినీ ఎరగని ప్రాజెక్టు మిషన్​ భగీరథ'

author img

By

Published : Sep 15, 2020, 8:49 PM IST

minister ktr review meeting in mission bhageeratha
minister ktr review meeting in mission bhageeratha

అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో.. మంత్రి కేటీఆర్​ సమీక్షాసమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 141 పట్టణాల్లో పనుల పురోగతి తెలుసుకున్నారు.

పట్టణాలు విస్తరించే అవకాశం ఉన్నందున.. అందుకు అనుగుణంగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి... హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 141 పట్టణాల్లో పనుల పురోగతి తెలుసుకున్నారు.

ఆయా పట్టణాల్లో పనులు జరుగుతున్న తీరు, ఇతర శాఖలతో సమన్వయం తదితర అంశాలను సమీక్షించారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించే ఉదాత్త లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ దేశచరిత్రలోనే కనీవినీ ఎరగని ప్రాజెక్టు అని మంత్రి తెలిపారు. క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి నాణ్యతను పరీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

minister ktr review meeting in mission bhageeratha
'దేశచరిత్రలోనే కనీవినీ ఎరగని ప్రాజెక్టు మిషన్​ భగీరథ'
minister ktr review meeting in mission bhageeratha
'దేశచరిత్రలోనే కనీవినీ ఎరగని ప్రాజెక్టు మిషన్​ భగీరథ'

ఇవీ చూడండి: కుదరని ఏకాభిప్రాయం... ముందుకు కదలని ప్రగతి చక్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.