ETV Bharat / city

'ఏం నడ్డాజీ.. మరి బండి సంజయ్​పై చర్యలెప్పుడు?'

author img

By

Published : Jun 5, 2022, 8:07 PM IST

KTR Comments: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై, భాజపా అధిష్ఠానంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. భాజపా అధికార ప్రతినిధులను సస్పెండ్​ చేసిన నేపథ్యంలో విడుదల చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. జేపీ నడ్డాకు ప్రశ్నలు సంధించారు. మరోవైపు.. జలశక్తి మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister ktr questioned jp nadda for not taking an actions on bandi sanjay
minister ktr questioned jp nadda for not taking an actions on bandi sanjay

KTR Comments: అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్నట్లు భాజపా విడుదల చేసిన ప్రకటనపై కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. భాజపా అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందాల్‌ను ఆ పార్టీ ఇవాళ సస్పెండ్‌ చేసింది. మత భావాలను కించపరిచే విధంగా వ్యవహరించిన నేపథ్యంలో వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఒక వర్గం వారిని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఏ మతానికి చెందిన వ్యక్తులనైనా అవమానించడాన్ని భాజపా ఖండిస్తుందని పార్టీ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్​ ప్రశ్న సంధించారు.

భాజపా నిజంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంటే.. ఇతర మతాలను అగౌరపరుస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌పై చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. అన్ని మసీదులను తవ్వాలని.. ఉర్దూపై నిషేధం విధించాలని బహిరంగా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎందుకీ పక్షపాత ధోరణి అంటూ నిలదీశారు. దీనిపై ఏమైనా స్పష్టత ఇవ్వగలరా అని నడ్డాను ట్విట్టర్​ వేదికగా అడిగారు.

  • If the BJP truly respects all religions equally, should you also not suspend Telangana BJP chief who made an open public statement wanting to dig up all the mosques & impose a ban on Urdu?

    Why this selective treatment @JPNadda Ji? Any clarification? https://t.co/6tqMLWSW3w

    — KTR (@KTRTRS) June 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జలపాతాలకు ప్రసిద్ధి చెందిన తెలంగాణలో "జల్​ జీవన్​ మిషన్​" పథకం కింద 54 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చి రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు భరోసా అందించామని.. జలశక్తి మంత్రిత్వ శాఖ చేసిన ట్విట్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మిషన్​ భగీరథ" కార్యక్రమం.. తమదేనని కేంద్రం ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని ఘాటు విమర్శలు చేశారు. మిషన్​భగీరథ కోసం రూ. 19 వేల కోట్లు మంజూరు చేయాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినప్పుడు.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.. కానీ ఇప్పుడు ఆ పథకం తామే చేపట్టినట్టు చెప్పుకుంటోందని.. కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

  • Govt of India shamelessly misappropriates Telangana’s flagship project “Mission Bhagiratha” & makes it its own!

    When Niti Ayog recommend ₹19,000 Cr be granted for Telangana’s MB, not a paisa is given as support but now this IP infringement by Union Govt!!

    Shame on you NPA Govt https://t.co/h0z8uRyfsF

    — KTR (@KTRTRS) June 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.