ETV Bharat / city

పెండింగ్​ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: ఇంద్రకరణ్ రెడ్డి

author img

By

Published : Oct 19, 2020, 9:29 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... అరణ్య భవన్​లో ప్రజాప్రతినిధులు, సాగునీటిపారుదల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్​ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: ఇంద్రకరణ్ రెడ్డి
పెండింగ్​ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రి హైదరాబాద్ అరణ్యభవన్​లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల ప‌నుల‌ను యుద్ధప్రాతిప‌దిక‌న పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని... భూసేక‌ర‌ణ‌, నిర్వాసితుల‌కు న‌ష్టప‌రిహారం చెల్లింపులు తదితరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి చెప్పారు.

చెక్​ డ్యాంల నిర్మాణ పనులను కూడా పూర్తి చేసి చెరువులను నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి అన్నారు. చ‌నకా‌-కొరాట‌, కుమురం భీం, జ‌గ‌న్నాథ‌పూర్, నీల్వాయి ప్రాజెక్ట్ పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూన్​లోగా 93 వేల ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందించాల‌ని నీటిపారుదలశాఖ అధికారులకు సూచించారు. ప్రాణ‌హిత ప్రాజెక్ట్ స‌ర్వే చేప‌ట్టి ప‌నులు త్వర‌గా ప్రారంభ‌మ‌య్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా చేప‌ట్టిన 27వ ప్యాకేజీ, స‌ద‌ర్మట్ ఆనకట్ట పెండింగ్ ప‌నులను వేగ‌వంతం చేయాల‌న్న మంత్రి... 27వ ప్యాకేజీ ద్వారా డిసెంబ‌ర్​లో పదివేల ఎక‌రాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. తద్వారా చెరువుల‌ను నింపి యాసంగి పంట‌ల‌కు సాగు నీరందించ‌వ‌చ్చని అభిప్రాయపడ్డారు. 28వ ప్యాకేజీకి సంబంధించిన భూసేక‌ర‌ణ‌ ప్రక్రియను పూర్తి చేసి ప‌నులు ప్రారంభించాల‌ని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

ఇదీ చూడండి: నర్తనశాల ఫస్ట్​లుక్​ వచ్చేది రేపే!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.