ETV Bharat / city

Ts Cabinet Subcommittee: 24న మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

author img

By

Published : Sep 18, 2021, 11:16 AM IST

Updated : Sep 18, 2021, 3:12 PM IST

పోడుభూముల సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
పోడుభూముల సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

11:14 September 18

పోడుభూముల సమస్యలపై ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి సర్కార్ సమాయత్తమయింది. పోడు భూముల సమస్యలపై  మంత్రివర్గ ఉపసంఘం(Ts Cabinet Subcommittee meeting) సమావేశమైంది. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ భేటీలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరయ్యారు. 

రెండు గంటలకుపైగా పోడు భూముల సమస్యలపై ఈ భేటీ(Ts Cabinet Subcommittee meeting)లో చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులు వంటి పలు అంశాలు ఈ సమావేశం(Ts Cabinet Subcommittee meeting)లో చర్చకు వచ్చాయి. ఆగస్టులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్.. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. హరితహారం సహా ఇతర కార్యక్రమాల్లో భాగంగా పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ప్రతిసారి అధికారులు, రైతులకు మధ్య గొడవలు.. పలు సందర్భాల్లో దాడులు చోటుచేసుకుంటున్నాయి. వీటికి అడ్డుకట్టే వేసి ప్రకృతిలో మమేకమై సాగు చేసుకునే రైతులకు అండగా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాగా వీటన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 24న మరోసారి సమావేశం(Ts Cabinet Subcommittee meeting) కావాలని ఉపసంఘం నిర్ణయించింది. 

 ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి  క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్  శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Last Updated :Sep 18, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.