podu farmers : 'ఇన్నేళ్లు సాగు చేసిన భూములను లాక్కుంటే.. మా గతేంటి?'

author img

By

Published : Sep 11, 2021, 9:01 AM IST

పోడురైతుల గొడవ

అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాదవానిపల్లి సమీపంలోని తాటిచెలుక పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.

పోడురైతుల గొడవ

నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలో అటవీ శాఖ సిబ్బంది, పోడు రైతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాధవానిపల్లి సమీప అటవీ ప్రాంతంలోని తాటి చెలుక పోడు భూముల్లో మొక్కలు నాటుతున్న అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తాటి చెలుక ప్రాంతంలోని పోడు భూములను కొన్నేళ్లుగా.. తమ తాతలు, తండ్రులు సాగు చేస్తున్నారని వారి వారసులు తెలిపారు. ఏళ్ల తరబడి నమ్ముకున్న భూముల్లో మొక్కలు నాటి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడం దారుణమని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రైతులు సాగు చేస్తున్న భూములకు హక్కులను కల్పించాలని నల్లమల యూరేనియం ఐకాస కన్వీనర్‌ కలుముల నాసరయ్య డిమాండ్ చేశారు.

"అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. అరక కొట్టిన భూములు దున్ని మొక్కలు నాటుతున్నారు. అడ్డుకున్నా ఆగలేదు. ఇన్నేళ్లు ఈ భూములపైనే ఆధారపడ్డ మాకు మరోదారి లేదు. ఇంకో జీవనోపాధి లేదు. ఇప్పటికైనా సర్కార్ మాకు సాయం చేయాలి. ఈ భూములపై మాకు హక్కు కల్పించాలి."

- పోడు రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.