ETV Bharat / city

Job calendar: ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్​ను రీకాల్ చేయాలి: నారా లోకేశ్​

author img

By

Published : Jun 28, 2021, 10:53 PM IST

లక్షల్లో ఉద్యోగాలిచ్చామని ప్రకటించుకుంటూ.. ఇటీవల విడుదల చేసిన ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ రీకాల్ చేయాలని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిరుద్యోగుల సమస్యలు నెలరోజుల్లో పరిష్కరించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ సీఎంకు.. లోకేశ్ లేఖ రాశారు.

nara lokesh
nara lokesh

నిరుద్యోగుల సమస్యలు నెలరోజుల్లో పరిష్కరించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. లక్షల్లో ఉద్యోగాలిచ్చామని ప్రకటించుకుంటూ.. ఇటీవల విడుదల చేసిన ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ రీకాల్ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన విధంగా.. 2 లక్షల 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ.. ముఖ్యమంత్రి జగన్​కు లోకేశ్ లేఖ రాశారు.

పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 6,500కు పైగా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు సహా గ్రూప్- 1, గ్రూప్- 2 విభాగాల్లో 2 వేల పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నెల రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. బలవన్మరణం చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు.. రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించడంతో పాటు తెదేపా హయాంలో ఇచ్చిన రూ. 2 వేల నిరుద్యోగ భృతి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతలో కొందరు ఉద్యోగాలు లేక ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • నెల రోజుల్లో నిరుద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాలంటూ ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను.నిరుద్యోగుల స‌మ‌స్య‌లు పరిష్కరించకపోతే మ‌రో పోరాటానికి టిడిపి సిద్ధం.ఉత్తుత్తి ఉద్యోగాల డూబు క్యాలెండ‌ర్‌తో నిరుద్యోగుల్ని నిలువునా ముంచారు.మోసపూరిత జాబ్ క్యాలెండ‌ర్ ఉప‌సంహ‌రించుకోవాలి.(1/4) pic.twitter.com/Nqx4zMvCsO

    — Lokesh Nara (@naralokesh) June 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: MARIYAMMA: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.