ETV Bharat / city

కిషన్​రెడ్డి.. నీ తప్పును ఒప్పుకొనే ధైర్యం కూడా లేదా?: కేటీఆర్

author img

By

Published : Oct 1, 2022, 1:51 PM IST

Updated : Oct 1, 2022, 2:28 PM IST

KTR fired on Kishan Reddy in medical colleges: మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. ఓ సోదరుడిగా కిషన్‌రెడ్డిని ఎంతో గౌరవిస్తానని.. కానీ అబద్ధాలు ప్రచారం చేయడం తగదని ఆయన ట్విటర్​ వేదికగా విమర్శలు చేశారు.

IT Minister KTR
IT Minister KTR

మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం 9 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా కేటీఆర్‌ ప్రకటించారు. ‘‘ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధాలు మాట్లాడే కిషన్ రెడ్డికి తన తప్పును అంగీకరించే ధైర్యం కూడా లేదు’’ అని కేటీఆర్ విమర్శించారు.

  • Dear @kishanreddybjp Garu,

    I respect you as a brother but have not seen a more misinformed & hapless Union Cabinet Minister

    You had announced that Govt of India sanctioned 9 medical colleges to Telangana which was an utter LIE 👇

    You didn’t even have the courage to apologise pic.twitter.com/MWtnuXy4DG

    — KTR (@KTRTRS) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2022, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.