ETV Bharat / city

ISRO : టార్గెట్ ఫిక్స్ చేసిన ఇస్రో.. ఈ ఏడాది ఎన్ని ప్రయోగాలంటే..

author img

By

Published : Feb 4, 2022, 10:12 AM IST

టార్గెట్ ఫిక్స్ చేసిన ఇస్రో
టార్గెట్ ఫిక్స్ చేసిన ఇస్రో

ISRO : ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-సి52) ఫిబ్రవరి 14న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టనుంది. అయితే మొత్తంగా ఈ ఏడాది ఇస్రో నుంచి 19 రాకెట్ ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు, 4 టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్‌ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్‌-3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-సి52) ఫిబ్రవరి 14న సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టనుంది.

ISRO News : ఇది భూ పరిశీలన ఉపగ్రహం (ఆర్‌ఐశాట్‌-1ఎ)తోపాటు ఐఎన్‌ఎస్‌-2డి ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌-3 ప్రయోగం ఆగస్టులో చేపట్టేలా ప్రణాళికలు రచించారు. దీనిని గతేడాదే చేపట్టాలని నిర్ణయించినా కొవిడ్‌ వల్ల వాయిదా వేశారు. 2020, 2021లో కరోనా మహమ్మారి వల్ల ఇస్రో రాకెట్‌ ప్రయోగాలు సక్రమంగా చేపట్టలేకపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.