ETV Bharat / city

అంతర్జాతీయ ఆరోగ్య టీకాలకు పెరిగిన డిమాండ్​

author img

By

Published : Aug 29, 2022, 11:54 AM IST

International Health Vaccines విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలి. కరోనా తరవాత ఈ అంతర్జాతీయ ఆరోగ్య టీకాలు వేసుకునే వారు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నారు. వీటిలో ఆఫ్రికా దేశానికి వెళ్లే వారు తీసుకొనే ఎల్లో ఫీవర్​ టీకాకు డిమాండ్​ భారీగా పెరిగింది. వివిధ దేశాలకు వెళ్లేవారు ఏ టీకాలు తీసుకుంటారో చూద్దాం.

International Health Vaccines
అంతర్జాతీయ ఆరోగ్య వ్యాక్సిన్​లు

International Health Vaccines: అంతర్జాతీయ ఆరోగ్య టీకాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. కరోనాతో వెలవెలబోయిన నారాయణగూడ టీకా కేంద్రం ప్రస్తుతం విదేశాలకు వెళ్లే పర్యాటకులు, ఉద్యోగార్థులు, విద్యార్థులతో కిటకిటలాడుతోంది. నిత్యం 100-130 మంది వరకు అంతర్జాతీయ ఆరోగ్య టీకాల కోసం వస్తున్నారు. ఆఫ్రికా దేశాలకు వెళ్లేవారు ఎల్లోఫీవర్‌ టీకా వేయించుకోవడం తప్పనిసరి. దీన్ని గురు, శుక్రవారాల్లో మాత్రమే వేస్తుండటంతో 250-300 మంది వరకు వస్తున్నారు.

Demand for Yellow Fever Vaccine : విదేశీ ప్రయాణానికి ముందు 10-15 రోజుల ముందు టీకా వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్లలో ఎంఎంఆర్‌, మెనింజైటిస్‌, ఎల్లోఫీవర్‌, టైఫాయిడ్‌, హెపటైటిస్‌, వెరిసిల్లా ముఖ్యమైనవి. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం)లో అంతర్జాతీయ ఆరోగ్య టీకాల విభాగంలో వీటిని వేస్తారు. ఇందుకు రూ.50 సర్వీసు ఛార్జి చెల్లించాలి. అనంతరం ప్రభుత్వం ధ్రువపత్రం ఇస్తుంది.

ఇప్పుడు బయట కొనాల్సిందే.. గతంలో టీకాలను ఐపీఎం సొంతంగా కొనుగోలు చేసి అంతర్జాతీయ పర్యాటకులకు ఎల్లోఫీవర్‌ డోసు రూ.250కే ప్రజలకు ఇచ్చేది. ప్రస్తుతం ఎవరికి వారు తెచ్చుకోవాలని పర్యాటకులకు సూచిస్తోంది. దీంతో ఔషధ దుకాణాల్లో వీటికి ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లేవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉన్నారు. తర్వాత స్థానం పర్యాటకులది. అమెరికా వెళ్లేవారు టీకాలతో పాటు ముందు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎంఎంఆర్‌ను 48 రోజుల వ్యవధిలో రెండు డోసులు వేయించుకోవాలి. టీకా పొందాలంటే తొలుత ఐపీఎం వెబ్‌సైట్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్పటికప్పుడు టీకా వేస్తామని ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ సుశీల తెలిపారు. టీకా కోసం వచ్చేవారు పాస్‌పోర్టు తేవాలని చెప్పారు.

ఏ దేశం వెళ్లేవారు ఏఏ టీకాలు వేసుకోవాలి:

ఎంఎంఆర్‌ టీకా, టీబీ పరీక్షలు: యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా

మెనింజైటిస్‌: సౌదీఅరేబియా, రియాద్‌, జెడ్డా

టైఫాయిడ్‌: అబూదాబి, చైనా, దుబాయి, ఇంగ్లండ్‌, యూరోపియన్‌ దేశాలు, ఇరాన్‌, బహ్రెయిన్‌, ఇరాక్‌, ఇజ్రాయిల్‌, ఇటలీ, జపాన్‌, కువైట్‌, మస్కట్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, సింగపూర్‌

ఎల్లోఫీవర్‌ టీకా, ఓరల్‌ పోలియో: అల్బేనియా, అల్జీరియా, అంగోలా, అంటిగ్వా, బార్బుడా, బొలీవియా, బ్రెజిల్‌, బుర్కినో ఫాసో, బురుండి, కామెరూన్‌, సూడాన్‌, టాంజానియా, ఉగాండా, జాంబియా తదితర ఆఫ్రికా దేశాలు.

అమెరికాకు ఆప్షనల్‌ టీకాలు: డీటీ, హెపటైటిస్‌, మెనింజైటిస్‌, వెరిసెల్లా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.