ETV Bharat / city

Judges Transfer: రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు

author img

By

Published : Aug 12, 2021, 8:40 PM IST

Updated : Aug 12, 2021, 9:16 PM IST

Judges Transfer: రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు
Judges Transfer: రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు

20:37 August 12

రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు.. 14 మందికి పదోన్నతి

రాష్ట్రవ్యాప్తంగా భారీగా జిల్లా జడ్జిల బదిలీలు జరిగాయి. 45 మందిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మరో 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు జిల్లా జడ్జిలుగా తాత్కాలిక పదోన్నతి కల్పించి.. పోస్టింగులు ఇచ్చింది.

సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఆర్.తిరుపతి, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా జీవీ సుబ్రమణ్యం, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఎ.వీరయ్య నియమితులయ్యారు. సీనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, పి.లక్ష్మీ కుమారి, జి.సునీత రవీంద్రరెడ్డి, సి.పావని, ఎం.శరత్ కుమార్, ఎన్.రోజా రమణి, టి.అనిత, మహ్మద్ అఫ్రొజ్ అఖ్తర్, కె.ఉమాదేవి, బి.అపర్ణదేవి, సీహెచ్.పంచాక్షరి, బి.తిరుపతి, జె.కవిత, టి.సుహాసినిలకు జిల్లా జడ్జిలుగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ.. హైకోర్టు పోస్టింగులు ఇచ్చింది.

ఇదీచూడండి: ఏపీలో కృష్ణా బోర్డు బృందం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం

Last Updated :Aug 12, 2021, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.