ETV Bharat / city

మనం ఎంతమందిని గుర్తుపెట్టుకోగలమో తెలుసా..!

author img

By

Published : Mar 19, 2021, 5:16 AM IST

పొద్దున్నే లేస్తాం.. పాలవాడు.. కాసేపయ్యాక పేపర్ బాయ్​.. పక్కనే ఉన్న మార్కెట్​కు వెళ్తాం... అక్కడ చాలామంది. ఎక్కడికో ప్రయాణిస్తాం.. లెక్కలేనంత కొత్తవాళ్లు. ఇంతకీ మనం ఎంతమందిని గుర్తుపెట్టుకోగలం? అసలు ఎంతమందిని గుర్తించగలం?

how-many-of-you-do-you-remember
మనం ఎంతమందిని గుర్తుపెట్టుకోగలమో తెలుసా..!

రోడ్డు మీద వెళ్తుంటాం. ఎవరో వ్యక్తిని ఎప్పుడో చూసినట్లు అనిపిస్తుంది. కానీ ఎంతకీ గుర్తురాదు. అమ్మా.. రోడ్డు మీద ఓ వ్యక్తిని ఎక్కడో చూశానే. కానీ అస్సలు గుర్తురావట్లేదని చెప్తాం. వదిలేయ్ అని అమ్మ చెప్పిన అస్సలు పట్టించుకోం. గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఓ ఉద్యమంలా చేస్తుంటాం. గుర్తించడంపై మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా? అసలు జీవితంలో మనం ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం? అని ఆలోచన వచ్చిందా?

ఇంట్లో వాళ్లు.. స్నేహితులు.. కొత్తవాళ్లు.. ఇలా 24 గంటల్లో ఎంతోమందిని చూస్తాం. టీవీలు, పేపర్లలోనూ చాలామందిని మన దృష్టిలో పడతారు. మనం గమనించే వారిలో సగటున ఒక మనిషి 5 వేల మందిని గుర్తుపెట్టుకోగలరట. ఓ పరిశోధనలో తెలిసిన విషయం ఇది.

సర్వేలో పాల్గొన్న వారు వేయి నుంచి పదివేల మందిని గుర్తించగలరని తేలగా.. సగటున ఒక మనిషి 5 వేల మందిని గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు. వేల ఏళ్ల కిందట మనుషులు కేవలం గుంపులుగా జీవించేవారు. వారి జీవిత కాలంలో కొంతమందిని మాత్రమే చూసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రోజూ వేల మందిని చూస్తుంటాం. అలా జీవిత కాలంలో 5వేల మందిని గుర్తించగలం అని పరిశోధనలో తెలిసింది.

ఇదీ చదవండీ: సకల జనుల హితంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.