ETV Bharat / city

వరదతో హైదరాబాద్​లో ట్రాఫిక్‌కు అంతరాయం

author img

By

Published : Oct 13, 2022, 12:45 PM IST

rain effect
వర్ష ప్రభావం

Heavy traffic jam due to flood affected vehicles: గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాగులు ఉద్ధృతంగా ప్రవహించి, రోడ్డును కోతకు గురిచేస్తున్నాయి. మేడ్చల్​ జిల్లా సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.

భారీగా స్తంభించిన వాహనాలు

Heavy traffic jam due to flood affected vehicles: రాత్రి కురిసిన భారీ వర్షాలకు మేడ్చల్‌ జిల్లా సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ భారీ వర్షానికి కుత్బుల్లాపూర్ కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే ప్రధాన రహదారి కోతకు గురైంది. ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం మోకాలి లోతులో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరంగా వెళ్లేవారు ఒకరికొకరు సహాయం తీసుకొని వరద నీటిలో నుంచి రోడ్డును దాటుతున్నారు.

ఈ రోడ్డు కోతకు గురవ్వడంతో దీని ప్రభావం నగరం నుంచి మేడ్చల్ కరీంనగర్ హైవే వైపు వెళ్లే వాహనాలపై పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయి భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, అత్యవసర సేవలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నిలిచిపోవడంతో అందులో అంబులెన్స్​ సైతం ఇరుక్కుపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీడిమెట్ల, సూరారమ్ తదితర ప్రాంతాలలో ఉన్న చెరువులు పూర్తిగా నిండి నీరు పొంగడంతో రోడ్డు పై ప్రవహిస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.