ETV Bharat / city

ఖైరతాబాద్​ గణేశుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

author img

By

Published : Aug 22, 2020, 10:46 PM IST

Updated : Aug 23, 2020, 12:21 AM IST

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించేందుకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ఎవరూ రావొద్దని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ... ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు సెల్పీలు తీసుకుంటూ కనిపించారు.

heavy public at kairathabad ganesh without covid rules
ఖైరతాబాద్​ గణేశుడి వద్ద బారులు తీరిన జనాలు

వినాయక చవితి సందర్భంగా... ఏటా ఖైరతాబాద్ గణేశ్​ విగ్రహాన్ని దర్శనం చేసుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడం ఆనవాయితీ. ఈ ఏడాది మాత్రం కొవిడ్ కారణంగా... భక్తులు ఎవరు దర్శనానికి రావొద్దని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ పట్టించుకోకుండా మొదటి రోజే పెద్దఎత్తున్న భక్తులు దర్శించుకోవడానికి తరలివచ్చారు.

నిర్వాహకులు ఆన్​లైన్​లో దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించినప్పటికీ... పట్టించుకోకుండా వినాయకుడిని చూసేందుకు పోటీ పడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ... కనిపించారు. కొందరు భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా దర్శనానికి వచ్చారు.

Last Updated : Aug 23, 2020, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.