ETV Bharat / city

మరో 30 ఏళ్లు శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ నిర్వహణ జీఎంఆర్​దే..

author img

By

Published : May 5, 2022, 12:23 PM IST

Rajiv Gandhi International Airport: రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో 30 ఏళ్లు జీఎంఆర్​ గ్రూప్​ నిర్వహణలోనే ఉండనుంది. అంటే.. 2068 వరకు విమానాశ్రయ నిర్వహణ జీఎంఆర్​ గ్రూప్​దే అన్నమాట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ తన ఆమోదాన్ని తెలియజేస్తూ.. లేఖ పంపినట్టు జీఎంఆర్​ సంస్థ ప్రకటించింది.

gmr group to run Rajiv Gandhi International airport for another 30 years till 2068
gmr group to run Rajiv Gandhi International airport for another 30 years till 2068

Rajiv Gandhi International Airport: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్​ గ్రూప్​ సంస్థే మరో 30 ఏళ్లు నిర్వహించనుంది. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) సంస్థకు విమానాశ్రయ నిర్వహణ హక్కులు.. 2038 మార్చి 23వరకు ముగిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహణ హక్కుల గడువును మరో 30 ఏళ్ల పాటు పొడిగించాలని జీహెచ్​ఐఏఎల్​ దరఖాస్తు చేసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ తన ఆమోదాన్ని తెలియజేస్తూ లేఖ పంపినట్లు జీహెచ్‌ఐఏఎల్‌ ప్రకటించింది.

మరో 30 ఏళ్లు అంటే.. 2068 వరకూ ఈ విమానాశ్రయం జీహెచ్‌ఐఏఎల్‌ నిర్వహణలో ఉండనుంది. ప్రభుత్వంతో 2004, డిసెంబరు 30న కుదిరిన ఒప్పంద పత్రం (కన్సెషన్‌ అగ్రిమెంట్‌) ప్రకారం ఈ పొడిగింపు లభించినట్లు వివరించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌) అనుబంధ సంస్థ జీహెచ్‌ఐఏఎల్‌ నిర్మించి 2008 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విస్తరణ పూర్తయితే ఈ విమానాశ్రయం నుంచి ఏటా 3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు వచ్చివెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఏటా 1.50 లక్షల టన్నుల సరకు రవాణాను నిర్వహించగల సామర్థ్యం రాజీవ్​గాంధీ విమానాశ్రయానికి ఉంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.