ETV Bharat / city

HYDERABAD RAIN ALERT: హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దు: జీహెచ్​ఎంసీ

author img

By

Published : Oct 9, 2021, 12:14 PM IST

Updated : Oct 9, 2021, 2:16 PM IST

ghmc-alert-on-heavy-rain-in-hyderabad-city-today
ghmc-alert-on-heavy-rain-in-hyderabad-city-today

11:49 October 09

HYDERABAD RAIN ALERT : భాగ్యనగరంలో నేడు భారీ వర్షాలు

హైదరాబాద్​లో భారీ వర్షాలు(HYDERABAD RAIN ALERT) కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు జీహెచ్​ఎంసీ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వానలు(HYDERABAD RAIN ALERT) పడే అవకాశముందని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... కార్యాలయాలకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఇంట్లో ఉన్న వాళ్లు అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్​ఎంసీ చెప్పింది. సహాయం కోసం కంట్రోల్ రూం నంబరు 040 2111 1111కు కాల్ చేయాలని పేర్కొంది.

రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు..

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ రోజు కిందిస్థాయి గాలులు ఉత్తర, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఏర్పడి సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ప్రకటించారు.

ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి నాలుగైదు రోజులలో దక్షిణ ఒడిశా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు ఈ రోజు వాయువ్య ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి విరమించాయని స్పష్టం చేశారు. రాగల రెండు మూడు రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్​, ఝార్ఖండ్‌, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బంగ, ఒడిశాలతోపాటు మరికొన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు విరమించే అవకాశాలున్నాయని సంచాలకులు వివరించారు.

నిన్న దంచికొట్టింది..

శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి(Heavy Rain in Hyderabad Yesterday) భాగ్యనగరం అతలాకుతలం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపించాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి.. రాత్రంతా అంధకారంలోనే గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చంపాపేట, చందానగర్, చాంద్రాయణగుట్ట, జిల్లెలగూడ, దిల్​సుఖ్​నగర్, కోఠి, సరూర్​నగర్​, హయత్​నగర్​ పరిధిలోని చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వరద(Heavy Rain in Hyderabad Yesterday) చుట్టుముట్టింది. శనివారం కూడా వరద ప్రభావం ఉండటం వల్ల చాలాచోట్ల జనజీవనం స్తంభించింది. జిల్లెలగూడ బాలాజీనగర్​ కాలనీలో ఇళ్లలోకి మురికి నీరు చేరింది. ఆ ప్రాంతంలో డ్రైనేజీ పనులు జరుగుతుండటం వల్ల భారీ వర్షానికి మురికికాల్వలు పొంగిపొర్లి రహదారులపైకి, ఇళ్లలోకి చేరాయి. ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు తమ ఇళ్లు శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

శుక్రవారం వరణుడు సృష్టించిన బీభత్సం(Heavy Rain in Hyderabad Yesterday) ప్రభావంలోనే ఉన్న భాగ్యనగర ప్రజలు.. శనివారం కూడా వర్షాలు పడతాయన్న జీహెచ్​ఎంసీ ప్రకటనతో భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోంచి బయటకు వెళ్తే ఎక్కడ వరద(Heavy Rain in Hyderabad Yesterday)లో చిక్కుకుంటామో.. తిరిగి ఇంటికి చేరుకుంటామో లేదోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటకు వచ్చి.. వీలైనంత త్వరగా ఇల్లు చేరుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు.

Last Updated :Oct 9, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.