ETV Bharat / city

టాప్ టెన్ న్యూస్ @5PM

author img

By

Published : Nov 4, 2020, 5:00 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్ టెన్ న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

1. ఆ నాలుగు రాష్ట్రాలే కీలకం!

అగ్రరాజ్యంలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతున్న వేళ.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఎలక్టోరల్​ ఓట్లలో బైడెన్​ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్​నకు పట్టు ఉండటం వల్ల పరిస్థితులు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఎందుకీ వివక్ష

ఇంటింటికీ తాగునీరు ఇచ్చే విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ప్రశంసిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. నిధుల విషయంలో మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పదేళ్ల క్రితం పూర్తి చేసిన గుజరాత్​కు, కొద్దిపాటి పనులు కూడా పూర్తి కాని ఉత్తరప్రదేశ్​కు నిధులు ఇచ్చిన కేంద్ర.. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. తెరాస కార్యాలయానికి భూమి

దిల్లీలో తెరాస పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన భూమిని ఆ పార్టీకి కేంద్రం అప్పగించింది. తెరాస తరఫున మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డికి అధికారులు భూమిని అప్పగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఉత్తమ్ పరామర్శ

చౌటుప్పల్ వద్ద జరిగిన ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్​ వలీ కుమారుడు షేక్ షారుఖ్ మరణించాడు. వారి కుటుంబానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. నేను భయపడను

లాక్​డౌన్​తో తీవ్రంగా ప్రభావితమైన పేదలకు ఎలాంటి సాయం చేయని వారు.. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ప్రధాని మోదీ, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మోదీ ఓటింగ్​ మిషన్​ లేదా మోదీ మీడియకు తాను భయపడనని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. నేపాల్​లో భారత ఆర్మీ చీఫ్

మూడు రోజుల పర్యటనలో భాగంగా నేపాల్​ చేరుకున్నారు భారత సైన్యాధిపతి నరవాణే. ఈ సందర్భంగా ఆ దేశ సైన్యాధికారులు నరవాణేకు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు అగ్రరాజ్యంలోని నెవెడా రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మార్కెట్లకు మళ్లీ లాభాలు

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,900 మార్క్​పైన స్థిరపడింది. ఫార్మా, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఇదే తొలిసారి

ఐపీఎల్​లో ఈ ఏడాది ప్రతి జట్టు కనీసం 12 పాయింట్లతో లీగ్ దశను ముగించడం విశేషం. టోర్నీ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు

మెగాడాటర్​ నిహారిక కొణిదెల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 9న చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడుముళ్లు వేయనున్నారు. రాజస్థాన్​లో ఈ వివాహ వేడుక జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.