ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

author img

By

Published : Oct 29, 2020, 2:59 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

1. దేశానికే ట్రెండ్ సెట్టర్

మేడ్చల్​ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్​ కార్యాలయంలో ధరణి పోర్టల్​ను కేసీఆర్ ప్రారంభించారు. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి వెబ్​సైట్​లో ఉన్నాయని సీఎం తెలిపారు. విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా వారి భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో చూసుకోవచ్చన్నారు. ఇక నుంచి అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదన్నారు సీఎం కేసీఆర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. తెలంగాణ హైకోర్టుకు వెళ్లండి

హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు దురాక్రమణపై ఎన్జీటీలో విచారణ జరిగింది. జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. కవిత అను నేను..

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​ రెడ్డి తన కార్యాలయంలో కవితతో ప్రమాణం చేయించారు. కవితకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఈ నెల 9న జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. కేంద్రానికి సుప్రీం నోటీసులు

కరోనా వ్యాక్సిన్​ పేరుతో పలురకాల మందుల అమ్మకాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు న్యాయవాది ఎం.ఎల్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఆ బంధం బలమైనది

అగ్రరాజ్యంతో భారత్​ కుదుర్చుకున్న ఒప్పందాలు సొంత ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సమాజానికి లబ్ధి చేకూర్చుతాయని ప్రముఖ రక్షణ రంగం నిపుణలు ఉదయ్​భాస్కర్​ అభిప్రాయపడ్డారు. ఈటీవీ/ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఈ ఒప్పందాలపై వివరంగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ట్విట్టర్​ క్షమాపణలు

'చైనాలో లద్దాఖ్​' వ్యవహారంపై పార్లమెంటరీ సంయుక్త కమిటీకి మౌఖికంగా క్షమాపణలు తెలిపింది ట్విట్టర్​. తమ సంస్థ భారతలోని సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. 4 రోజుల్లో 58 మంది మృతి

అఫ్గాన్​లో ఇటీవల వరుస బాంబుదాడులు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే(అక్టోబర్​ 23 నుంచి 27వరకు) 58 మంది మృతిచెందారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏట దాడులు కాస్త తగ్గాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. బంగారానికి తగ్గిన డిమాండ్

కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో పసిడికి ఇటు దేశీయంగా, అటు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) ప్రకారం 2020 మూడో త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ 30 శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 19 శాతం క్షీణించింది. 2019 తర్వాత ఈ స్థాయిలో పసిడి డిమాండ్ తగ్గటం ఇదే ప్రథమం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ముంబయికే షాకిచ్చి..

ఐపీఎల్​, దేశవాళీ క్రికెట్​లో సత్తా చాటూతూ.. టీమ్​ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్​ యాదవ్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. 1992 తర్వాత మళ్లీ అలా!

విక్టరీ వెంకటేశ్.. కాలేజీకి వెళ్లి మరోసారి పాఠాలు చెప్పబోతున్నారట. తరుణ్ భాస్కర్​ తీయబోయే కొత్త సినిమా కోసమే వెంకీ ఇలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.