ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@9PM

author img

By

Published : Apr 5, 2021, 8:59 PM IST

TOP TEN 9PM NEWS, top ten headline news
టాప్​ టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. 'సీఎం సభకు ఏర్పాట్లు'

సిద్దిపేట జిల్లా జిల్లా గజ్వేల్​లో సీఎం కేసీఆర్​ మంగళవారం పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి హరీశ్​రావు పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సాగర్​ ప్రచార జోరు

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్నవారికి మద్దతుగా సీనియర్‌ నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇంటింటికీ వెళ్లి తమ పార్టీనే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ గ్రామంలో 51 మందికి కరోనా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం జయవరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గ్రామంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గ్రామంలో 180 మందికి కొవిడ్​ పరీక్షలు చేయగా 51 మందికి పాజిటివ్​ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఆ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి'

ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగిత్యాల జిల్లా చెరుకు రైతులు రోడ్డెక్కారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'జవాన్లకు అండగా ఉంటాం'

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని సీఆర్​పీఎఫ్​ క్యాంపు వద్ద జవాన్లతో హోం మంత్రి అమిత్​ షా సమావేశమయ్యారు. జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడన్నారు షా. మావోయిస్టు సమస్య వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రికార్డులకెక్కిన ​వంతెన

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వారధిగా రికార్డలకెక్కిన చీనాబ్‌ వంతెన నిర్మాణంలో అత్యంత కీలకఘట్టం పూర్తయింది. కీలకమైన మైలురాయిగా భావించే ఉక్కువంపు లేదా స్టీల్‌ ఆర్చ్‌ నిర్మాణం పూర్తయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఈ నెల 8న సీఎంలతో ప్రధాని

ఈ నెల 8న.. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. వర్చువల్​గా నిర్వహించనున్న ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 7 నెలల కనిష్ఠానికి తయారీ రంగం!

దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కారణంగా.. తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించాయి. ఐహెచ్​ఎస్​ మార్కిట్ నివేదిక ప్రకారం.. మార్చిలో తయారీ రంగ పీఎంఐ ఏడు నెలల కనిష్ఠ స్థాయి అయిన 55.4 వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. చెన్నై జట్టు మరో స్థాయిలో!

ఇటీవల జట్టుతో చేరిన రైనా, జడేజా గురించి ఆసక్తికర ట్వీట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్​. వారిద్దరూ ప్రాక్టీస్​ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన సీఎస్కే.. 8+3=11.. అని పోస్టు పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అక్షయ్ మూవీ వాయిదా-షూట్​లో రకుల్

అక్షయ్​కుమార్​ నటించిన 'సూర్యవంశీ' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. రకుల్​ ప్రీత్​ సింగ్​ నటిస్తున్న కొత్త హిందీ సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.