ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@9PM

author img

By

Published : Mar 27, 2021, 9:00 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​ టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. పండుగలు, ర్యాలీలపై నిషేధం

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ర్యాలీలు, ఉత్సవాలపై కూడా ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా

యాదాద్రి ఆలయంలోని 30 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్​ వచ్చింది. ఉద్యోగులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల స్వామివారి ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్​ను గెలిపించండి'

ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​ను గెలిపించాలని నాగార్జునసాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి కోరారు. నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన కాంగ్రెస్‌ జనగర్జన సభలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'టీకా తీసుకున్నా కరోనా వచ్చే అవకాశం'

టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో 0.7 శాతం కరోనా టీకా వృథా అయిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. తొలి దశలో 80% పోలింగ్​

బంగాల్​ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. 190 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అసోంలో ప్రశాంతం

అసోంలో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటలవరకు మొత్తం 72.14శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బంగ్లా ప్రధానితో మోదీ

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లటం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 91కి చేరిన మృతులు

మయన్మార్​లో ఆర్మీ దినోత్సవం రోజున ఆందోళనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపింది. నిరసన కారులపై సైన్యం జరిపిన హింసాకాండలో ఒక్కరోజులోనే ప్రజలు పదుల సంఖ్యలో మృతి చెందినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 91కి చేరినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఇండియాXఇంగ్లాండ్​: గెలుపెవరిదో?​

వన్డే సిరీస్‌లో భారత్‌-ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. ఇదివరకే టెస్టు, టీ20 సిరీస్‌లను గెలిచిన కోహ్లీసేన.. ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆ స్టార్​ హీరోతో శేఖర్​ కమ్ముల మూవీ!

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల 'లవ్​స్టోరీ' తర్వాత తన తదుపరి చిత్రం హీరో వెంకటేశ్​తో చేయనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.