ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM

author img

By

Published : Mar 22, 2021, 8:57 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. 150-200 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లాలో 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకొంది. గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్ల కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 150 నుంచి 200 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ప్రజలు ముందుకు రావడం లేదు'

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస రావు తెలిపారు. పాఠశాలలు, వసతిగృహాల్లో ఇటీవల కరోనా కేసులు వెలుగులోకి వచ్చినందున అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కరోనా కేసులు బయట పడుతున్నప్పటికీ తీవ్రత, లక్షణాలు గతంలో మాదిరి లేవన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 30 శాతం ఫిట్‌మెంట్

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్​ వరాల జల్లు కురిపించారు. 30 శాతం పీఆర్సీతో పాటు ఉద్యోగ పదవీ విరమణ పెంపును 61 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రకటన చేశారు. 2020 ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పాఠశాలల కొనసాగింపుపై తర్జన భర్జన

కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల కొనసాగింపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. పాఠశాలల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'మహా'లో లేఖ రచ్చ!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై తీవ్ర ఆరోపణలతో ముంబయి మాజీ సీపీ రాసిన లేఖ దుమారం రేపుతోంది. వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారని సీపీ పేర్కొన్న సమయంలో.. దేశ్​ముఖ్ ఎక్కడ ఉన్నారనే అంశంపై పాలక విపక్షాలు మాటల దాడి చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. వివాదాస్పద బిల్లుకు ఆమోదం

విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. 'దిల్లీ' బిల్లు లోక్​సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం దిల్లీ ప్రభుత్వమంటే.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని, కార్యనిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయన అభిప్రాయం తీసుకోవాలని పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఈసీ కీలక నిర్ణయం

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్​కు 72 గంటల మందు బైక్​ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. '130కోట్ల నకిలీ ఖాతాలు తొలగింపు'

2020 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఏకంగా 130 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ఫేస్​బుక్ వెల్లడించింది. కొవిడ్‌ 19 టీకాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేలా ఉన్న కోటికి పైగా పోస్టులు, వీడియోలను తీసేసినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అదరగొట్టిన షూటర్లు

ఐఎస్ఎస్​ఎఫ్​ వరల్డ్​కప్​లో భారత షూటర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. తాజాగా.. మరో 3 స్వర్ణాలు భారత బృందాన్ని వరించాయి. ఇప్పటివరకు 6 బంగారు పతకాలు సాధించిన ఇండియా.. మొత్తం 14 పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. జాతీయ చిత్ర అవార్డుల విజేతలు

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్​బాబు 'మహర్షి' అవార్డులు దక్కాయి. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్​ సింగ్​ 'చిచ్చోరె' నిలిచింది. ఉత్తమ నటుడిగా ధనుష్​, ఉత్తమ నటిగా కంగనా రనౌత్​కు జాతీయ అవార్డు వరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.