ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM

author img

By

Published : Mar 15, 2021, 8:59 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. 'పసుపు బోర్డు ప్రతిపాదన లేదు'

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పది రోజులపాటు సమావేశాలు

బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 26 వరకు శాసనసభను సమావేశపరచాలని నిర్ణయించారు. ఈనెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా రెండు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ... మూడు రోజుల పాటు పద్దులపై చర్చ చేపడతారు. 26 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఆదర్శంగా నిలిచాం'

అన్నివర్గాల ప్రజల పురోగతికి కట్టుబడి ఉన్నామని... రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ తమిళిసై... ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలో వినూత్న పథకాలతో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కేసీఆర్​కు ఆహ్వానం

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో సీఎంను ఆలయ అధికారులు, ఆలేరు ఎమ్మెల్యే, విప్‌ గొంగిడి సునీత మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సోదాలు..ముగ్గురు అరెస్ట్​

దిల్లీ, కర్ణాటక, కేరళలోని 11 ప్రాంతాల్లో ఎన్​ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్​, ఐసిస్​ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. టీకా పంపిణీ 3 కోట్ల+

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త తీరాలకు చేరింది. సోమవారం నాటికి 3 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. ప్రజలు నిబంధనలు పాటించకపోవటమే కేసుల పెరుగుదలకు కారణమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆ కేసులో ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో దోషిగా తేలిన అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభివర్ణించింది. ఉరిశిక్షతో పాటు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మయన్మార్​లో మార్షల్​ చట్టం

మయన్మార్​లో అతిపెద్ద నగరమైన యాంగూన్​లోని ఆరు ప్రాంతాల్లో మార్షల్​ చట్టాన్ని అమలు చేసింది సైన్యం. నార్త్​ డగూన్​, సౌత్​ డగూన్​, డగూన్​ సైకన్​, నార్త్​ ఒక్కలప, లైయింగ్​ థార్​ యార్​, శ్వేపైత ప్రాంతాల్లో ఈ మార్షల్​ చట్టాన్ని సైన్యం ప్రయోగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మూడో టీ20 సాధించేదెవరు?

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ మధ్య మంగళవారం మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్​ల్లో చెరొకటి గెలిచి సిరీస్​ సమం చేయగా.. మూడో టీ20లో గెలుపొంది సిరీస్​ ఆధిక్యంలో కొనసాగాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన

93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్​ ప్రకటించారు. ఇందులో భారతీయ చిత్రం 'సూరరై పోట్రు' చోటు దక్కించుకోలేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.