ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

author img

By

Published : Feb 25, 2021, 9:00 PM IST

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. పింక్​ టెస్టు భారత్​దే

మొతేరా వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన డే/నైట్​ టెస్టులో భారత్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో టీమ్​ఇండియా గెలుపొందింది. దీంతో నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. శివకాశీలో ఐదుగురు మృతి

తమిళనాడు శివకాశీలోని బాణసంచా తయారీ యూనిట్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు పూర్తి అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా శాఖల వారీ భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను కేటీఆర్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'త్వరగా సీరం సర్వే చేయించండి'

వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రాష్ట్రానికి మరోసారి అవార్డులు

తెలంగాణకు మరోసారి స్కోచ్‌ అవార్డులు లభించాయి. స్కోచ్‌ ఇ-గవర్నెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. 2020కి గాను స్కోచ్ ఉత్తమ మంత్రి అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ఆ నియోజకవర్గంలో అలజడులు'

సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ ఓటర్లను బెదిరించి ఏపీ పంచాయతీ ఎ‌న్నికల్లో వైకాపా దొడ్డిదారిన గెలిచిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలో తెదేపా కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలగా.. కేబినెట్​ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే'

సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నరైతులతో చర్చించడానికి ఎప్పుడైనా సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ స్పష్టం చేశారు. ఇప్పటికే 12 విడతలుగా చర్చలు జరిపినట్లు తెలిపిన ఆయన.. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడం వల్ల అమలు చేయలేమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'పేదరికంపై చైనా విజయం!'

తమ దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలలో 77 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కొత్త సినిమాల అప్డేట్స్

కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో షాదీ ముబారక్, స్పైడర్​మ్యాన్ 3, ఏ1 ఎక్స్​ప్రెస్, రంగ్​ దే, తెల్లవారితే గురువారం, పవర్​ ప్లే చిత్ర సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.