ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM

author img

By

Published : Aug 19, 2022, 12:58 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

  • నంబర్‌వన్‌గా నిలవాలంటే ఆ మూడు సూత్రాలు పాటించాలన్న కేటీఆర్

ప్రపంచ దేశాల్లో భారత్‌ నంబర్ వన్‌గా నిలవాలంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్‌నెస్ అనే సూత్రాలు పాటించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచిందని అన్నారు.

  • 5నెలల గర్భవతికి అబార్షన్ చేస్తుండగా మృతి, అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు

ప్రేమించానని వెంటపడ్డాడు.. నువ్వే లోకమంటూ ఆమెను మాయ చేశాడు. అతడు అడగ్గానే శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. ఏవరికీ తెలియకుండా ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించగా పరిస్థితి విషమించి యువతి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • ఉద్యోగాలు చేస్తున్నప్పుడు దొరకలే, ఫించన్లు తీసుకున్నపుడు దొరికాడు

మూడో కంటికి అనుమానం రాకుండా రెండు ఉద్యోగాలు చేస్తూ రెండు చోట్లా రిటైర్​య్యాడు ఓ గనుడు . అక్కడితో ఆశ చల్లారక ఫించను కోసం రెండు చోట్ల అఫ్లీకేషన్​ పెట్టగా అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో ఆయన పై కేసు నమోదుచేసిన పోలీసులు విచరణ చేపడుతున్నారు.

  • చూస్తే జిరాక్స్​ సెంటర్,​ లోపలికి వెళ్తే బయటపడింది అసలు విషయం

హైదరాబాద్​ సహా వేర్వేరు నగరాల్లో నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాను హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు లక్షల యాభైవేలు రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరాలు అన్నింటికి కర్ణాటకకు చెందిన వ్యక్తి ప్రధాన నిందితునిగా పోలీసులు గుర్తించారు.

  • ప్రియుడితో భార్య పరార్​, ముగ్గురు పిల్లలకు విషం తాగించి

భార్య ఇంటికి తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనతో పాటు ముగ్గురు పిల్లలకు కూడా విషం తాగించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • బిర్యానీ బిల్లు విషయంలో గొడవ, కత్తితో దారుణంగా పొడిచి

బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. రూ.50 చెల్లించలేదని బిర్యానీ తిన్న వ్యక్తిని ఓ హోటల్​ యజమాని కత్తితో దారుణంగా పొడిచాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని జలాన్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

  • ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా, ఏం జరిగిందో తెలుసుకోండి మరి

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, రిఫండు క్లెయిమ్​ చేశారా, ఇంకా ఆ మొత్తం మీ ఖాతాలో జమ కాలేదా, మరేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారా.

  • యాపిల్‌ యూజర్లకు బిగ్​ అలర్ట్, వెంటనే అప్డేట్​ చేసుకోండి లేకుంటే

తమ ఉత్పత్తుల్లోని సాఫ్ట్​వేర్​లో తీవ్రమైన భద్రతా లోపాన్ని గుర్తించినట్లు టెక్ దిగ్గజం యాపిల్​ తెలిపింది. ఐఫోన్​, ఐపాడ్ యూజర్లు తమ సాఫ్ట్​వేర్లను వెంటనే అప్డేట్​ చేసుకోవాలని సూచించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని లోపాన్ని ఆసరాగా చేసుకొని హ్యాకర్లు అనైతిక చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

  • హీరోయిన్​ సమంత మిస్సింగ్​, ఫ్యాన్స్​ ఆందోళన

హీరోయిన్ సమంత చేసిన ఓ పని.. ప్రస్తుతం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ సామ్​ ఏం చేసిందంటే.

  • పోకిరికి, ఎస్​ఎస్​ఎమ్​బీ 28కు ఉన్న ఈ లింక్​ తెలుసా

హీరో మహేష్​​​ సినీ కెరీర్​లో ఏప్రిల్​ 28 తేదీ సెంటిమెంట్​ డేట్​ అనే చెప్పుకోవాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు రిలీజ్​ చేసిన చిత్రం బాక్సాఫీస్​ను బద్దలు కొట్టడమే కాకుండా ఆయన స్టార్​డమ్​ను పెంచింది. ఇప్పుడు అదే రోజున మరో సినిమాను రిలీజ్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు మహేశ్.​ మరీ ఆ సెంటిమెంట్​ ఏ మేరకు వర్కవుట్​ అవుతుందో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.