ETV Bharat / city

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

author img

By

Published : Mar 7, 2022, 12:49 PM IST

Updated : Mar 7, 2022, 4:34 PM IST

Telangana budget session : శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తి పాటించకుండా, ఏకపక్షంగా సభను నడుపుతున్నారంటూ కాంగ్రెస్​ విమర్శించింది. విపక్ష సభ్యులకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి కాంగ్రెస్​ సభ్యులు వాకౌట్​ చేశారు.

congress mlas walked
clp leader bhatti

Telangana budget session : శాసనసభ బడ్జెట్​ సమావేశాల్లో నిబంధనలను పాటించకుండా.. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిందని కాంగ్రెస్​ ఆరోపించింది. ప్రభుత్వ తీరును తప్పబట్టింది. గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది. తన సభ్యులకు పాయింట్​ ఆఫ్​ ఆర్డర్​ కింద మైక్​ ఇవ్వకుండా నిబంధలను తుంగలో తొక్కారని విమర్శించింది. విపక్ష సభ్యులకు కనీస గౌరవం ఇవ్వకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారంటూ నిరసన తెలిపిన కాంగ్రెస్​ శాసనసభాపక్షం.. సభ నుంచి వాకౌట్​ చేసింది.

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

భాజపా సభ్యులు సస్పెండ్​..

శాసన సభలో మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్​, రఘునందర్​రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్​ చేసింది. భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. దీనిపై స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. ఈ సెషన్​ పూర్తయ్యే వరకు భాజపా సభ్యులను సస్పెండ్​ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీచూడండి: Telangana Budget 2022-23 : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Last Updated : Mar 7, 2022, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.