ETV Bharat / city

CM KCR speech in assembly: సకల జనుల సహకారంతో తెలంగాణలో హరితనిధి: కేసీఆర్

author img

By

Published : Oct 1, 2021, 3:26 PM IST

Updated : Oct 1, 2021, 3:57 PM IST

CM KCR speech in assembly: 'తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన'
CM KCR speech in assembly: 'తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన'

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అటవీశాఖ సాయంతో పంచాయతీ సిబ్బంది నర్సరీలను పెంచుతున్నారన్నారు. తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉందని సీఎం పేర్కొన్నారు. హరిత నిధికి తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారని.. హరితనిధికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నామన్నారు.

మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 2015లోనే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నామని.. సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని సీఎం వెల్లడించారు. ప్రకృతి వనాలకు ఎంతో విశిష్టత ఉంటుందని ఆయన అసెంబ్లీలో తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం భూభాగం 2 కోట్ల 75లక్షల ఎకరాలు ఉండగా... ప్రభుత్వ లెక్కల ప్రకారం 66 లక్షలకుపైగా అటవీ భూములు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులను మాయం చేశారని.. కళ్ల ముందే అడవులు ధ్వంసమయ్యాయని సీఎం మండిపడ్డారు.రాష్ట్రంలో అడవులను పునరుద్ధరణ చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. 2.30కోట్ల మొక్కలు నాటాలన్న సంకల్పంతో కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. గతంలో మొక్కల సమీకరణలో చాలా ఇబ్బందులు ఉండేవని... మన దగ్గర నర్సరీలు ఉండేవి కావని సీఎం తెలిపారు. ప్రస్తుతం నర్సరీలు అందుబాటులో ఉన్నాయని.. ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి కృషి చేయాలన్నారు. వేర్ల మొక్కల ద్వారా అడవుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండేలా బిల్లు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. అటవీశాఖ సాయంతో పంచాయతీ సిబ్బంది నర్సరీలను పెంచుతున్నారన్నారు. రాష్ట్రంలో 19,472 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్న కేసీఆర్​.. గతంలో పల్లె ప్రకృతి వనం ఒక్కటి కూడా ఉండేది కాదన్నారు. గతంలో పార్కు అంటే గ్రామాల్లో తెలిసేది కాదని... 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెరుగుతున్నాయన్నారు. 53 అర్బన్ పార్కుల్లో పనులు బాగా జరిగాయని సీఎం కేసీఆర్​ వివరించారు. మిగతా ప్రాంతాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికితే రూ.4 లక్షల జరిమానా విధించారని సీఎం గుర్తు చేశారు. పర్యావరణాన్ని రక్షించాలంటే మొక్కల పెంపకాన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

CM KCR speech in assembly: సకల జనుల సహకారంతో తెలంగాణలో హరితనిధి: కేసీఆర్

తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉంది. హరిత నిధికి తెరాస ప్రజాప్రతినిధులు అంగీకరించారు. హరితనిధికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాం. హరితనిధి ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాప్రతినిధులు హరిత నిధి కింద రూ.500 ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్రంలోని ఐఏఎస్​ అధికారులందరూ వారి జీతం నుంచి ప్రతి నెల గ్రీన్​ ఫండ్​గా రూ.100 ఇచ్చేందుకు అంగీకరించారు. రాష్ట్రంలోని ఐపీఎస్​లు కూడా ఇచ్చేందుకు అంగీకరించారు. ప్రతి నెలా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హరిత నిధికి జమ చేస్తారు. మిగతా పక్షాలు కూడా హరితనిధికి ముందుకు రావాలి. హరితనిధి విషయమై ప్రతిపాదనలు కూడా వచ్చాయి. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

విద్యార్థులు భాగస్వామ్యమయ్యేలా..

విద్యార్థులను హరితనిధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రవేశాలపుడు హరితనిధికి జమ చేయాలని యోచన చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రవేశాలప్పుడు రూ.5 జమ చేయాలని సూచించారు. అలాగే హైస్కూల్‌ విద్యార్థులు రూ.15, ఇంటర్‌ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులు రూ.100 జమ చేయాలన్నారు. లైసెన్స్‌ల రెన్యువల్‌ సమయంలో హరితనిధి జమకు యోచించాలన్నారు. వ్యాపారులు, బార్లు, మద్యం దుకాణదారులు జమ చేయాలని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. రెన్యువల్‌ సమయంలో రూ.వెయ్యి జమకు ప్రతిపాదన చేశామన్నారు. రాష్ట్రంలో నిత్యం 8 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్న సీఎం.. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో రూ.50 జమ చేయాలన్నారు.

పోడు భూముల వ్యవహారం పరిష్కారానికి గిరిజనులకు ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న సీఎం... సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: KCR Speech in Assembly 2021: ఏకగ్రీవ పంచాయతీలకు నిధులిస్తమని మేమెప్పుడు చెప్పినం: కేసీఆర్

Last Updated :Oct 1, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.