ETV Bharat / city

రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని బ్యాంకులకు చెబుతాం: భట్టి

author img

By

Published : Dec 18, 2019, 4:46 PM IST

CLP LEADER BHATTI
రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని బ్యాంకులకు చెబుతాం: భట్టి

తెరాస ప్రభుత్వం చేసిన రూ.3లక్షల కోట్ల అప్పులను మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంతో తీర్చాలనుకుంటుందని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. అందువల్లనే మద్యం ధరలను పెంచినట్లు తెలిపారు.

విచ్చలవిడి మద్యం విక్రయాలను నియంత్రించాలని డిమాండ్​ చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మండిపడ్డారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తుండడమే ఇందుకు కారణమన్నారు.

కాళేశ్వరం, మిషన్​ భగీరథ, ఇతర పథకాలకు చేసిన అప్పులను మద్యం నుంచి వచ్చిన ఆదాయం ద్వారా తీర్చాలనుకుంటున్నారని భట్టి ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే తీవ్ర నిరసనలు తప్పవని హెచ్చరించారు. అడ్డగోలు అప్పులు ఇవ్వొద్దని కమర్షియన్​ బ్యాంకులకు చెబుతామని సీఎల్పీ నేత భట్టి తెలిపారు.

రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని బ్యాంకులకు చెబుతాం: భట్టి

ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.