ETV Bharat / city

CJI In Christmas Celebrations: క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ

author img

By

Published : Dec 25, 2021, 4:41 PM IST

CJI in Christmas Celebrations: ఏపీలోని విజయవాడ నోవాటెల్ హోటల్​లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. హోటల్‌కు విచ్చేసిన బిషప్‌లు.. ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు.

CJI In Christmas Celebrations
క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana AP tour: ఏపీలోని విజయవాడ నోవాటెల్ హోటల్​లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ కూడా పాల్గొన్నారు. హోటల్‌కు విచ్చేసిన బిషప్‌లు.. క్రిస్మస్ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం బిషప్‌లకు సీజేఐ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపి, కేక్ తినిపించారు. ఈ వేడుకల్లో సీజేఐతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ ఎన్వీ రమణ

సీజేఐని కలిసిన ప్రముఖులు

చిన్న జీయర్ స్వామి ఆశ్రమ పండితులు సైతం సీజేఐ ఎన్వీ రమణను కలిశారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, పలువురు ప్రజాప్రతినిధులు కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.