ETV Bharat / city

CJI at IAMC Hyderabad Inauguration : 'రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర'

author img

By

Published : Dec 18, 2021, 11:13 AM IST

Updated : Dec 18, 2021, 12:45 PM IST

IAMC Hyderabad Inauguration : తాను అడగగానే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని(ఐఏఎంసీ) హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్​ నానక్​రామ్​గూడ ఫొనిక్స్ వీకే టవర్​లో ఏర్పాటు చేసిన ఐఏఎంసీ కేంద్రాన్ని సీఎం కేసీఆర్​తో కలిసి ప్రారంభించారు.​

CJI at IAMC Hyderabad Inauguration
CJI at IAMC Hyderabad Inauguration

ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

IAMC Hyderabad Inauguration : ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగకీరించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో మంచి వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రాన్ని (ఐఏఎంసీ) జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.

CJI at IAMC Hyderabad Inauguration
పూజా కార్యక్రమంలో సీజేఐ, సీఎం కేసీఆర్

IAMC Hyderabad Inauguration : నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభోత్సవం అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

CJI at IAMC Hyderabad Inauguration
ఐఏఎంసీ వసతుల పరిశీలనలో సీజేఐ, సీఎం కేసీఆర్

CJI Inaugurated IAMC Hyderabad : రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర అని సీజేఐ పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనికోసం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. వివాదాల పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టమన్న సీజేఐ.. ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారమవుతాయని అన్నారు.

CJI at IAMC Hyderabad Inauguration
ఐఏఎంసీ ప్రాంగణాన్ని సీజేఐకి అప్పగిస్తున్న సీఎం కేసీఆర్

CJI Justice NV Ramana At IAMC Hyderabad :"ఐఏఎంసీ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్ అంగీకరించారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైంది. మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అతితక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో పరిష్కారమే లక్ష్యం. దేశంలో ఆర్బిట్రేషన్, మీడియేషన్ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ఉత్తర, దక్షిణ భారతానికి హైదరాబాద్‌ వారధి లాంటిది. ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది."

- జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

International Center for Arbitration and Mediation Hyderabad : దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్​లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఫొనిక్స్ వీకే టవర్​లో 25వేల చదరపు అడుగుల్లో ఈ కేంద్రం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ ఐఏఎంసీ వెబ్​సైట్​ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Dec 18, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.