ETV Bharat / city

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

author img

By

Published : Apr 6, 2021, 4:39 PM IST

Central funding for the development of national highways
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1005.38 కోట్లు మంజూరు చేశామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. నిధులు మంజూరు చేసినట్లు మంత్రి ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

  • For Telangana -
    Ministry of Road Transport and Highways has sanctioned 195.6 km of National Highways at a cost of 1005.38 Cr In the state of Telangana for 2020-21.#PragatiKaHighway

    — Nitin Gadkari (@nitin_gadkari) April 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసింది. 2020-21 ఏడాదికి గాను సుమారు 196 కిలోమీటర్ల మేర... జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1005.38 కోట్లు మంజూరు చేశామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. నిజాంపేట్‌-బీదర్‌ జాతీయ మార్గంలో భూసేకరణ, పునరావాసానికి 27.79 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్​హెచ్​-564లో భాగమైన నకిరేకల్‌-నాగార్జున సాగర్‌ మార్గంలో.. పనులకు అనుమతి ఇచ్చామని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు ఎన్​హెచ్​-44 మార్గంలో రోడ్డు భద్రత పెంపు కోసం అండర్​పాస్, సర్వీస్ రోడ్లకు 21.16 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

హైదరాబాద్‌-భూపాలపట్నం మార్గంలో ఆరు లైన్ల రహదారి విస్తరణకై 48.32 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎల్బీ నగర్-మల్కాపూర్ ఆరు లైన్ల క్యారేజ్ వే పునరుద్ధరణ, విస్తరణ, సర్వీస్ రోడ్లు సహా భద్రత చర్యల కోసం 545.11 కోట్లు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఎన్​హెచ్​-163 రహదారి 4 లైన్ల విస్తరణ, అభివృద్ధికై 317 కోట్లు మంజూరు చేశామని.. జడ్చర్ల-కల్వకుర్తి మార్గంలో 4 లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి 45 కోట్లు అందించామని నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

ఇదీ చదవండి: 'న్యాయంపై ప్రజల్లో విశ్వాసం పెరిగేది అప్పుడే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.