ETV Bharat / city

cbi court verdict: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు...

author img

By

Published : Feb 12, 2022, 12:15 PM IST

cbi court verdict: రుణాల పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. ఛార్జ్ షీట్​పై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులను దోషులుగా ప్రకటించింది. ఏడుగురికి జైలు శిక్ష, జరిమానా విధించింది.

Punjab national bank
పంజాబ్ నేషనల్ బ్యాంక్

cbi court verdict: పంజాబ్ నేషనల్ బ్యాంకును రుణాల పేరిట మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. 2010లో తప్పుడు పత్రాలతో రుణాలు ఇచ్చి 2.6 కోట్ల రూపాయలు మోసం చేశారని నిందితులపై కేసు నమోదు చేసింది. ఛార్జ్ షీట్​పై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులను దోషులుగా ప్రకటించింది. ఏడుగురికి జైలు శిక్ష, జరిమానా విధించింది.

ఈ కేసులో ఎవరెవరు ఉన్నారంటే...

పీఎన్​బీ మాజీ చీఫ్ మేనేజర్ బి.సత్యారావు, మాజీ సీనియర్ మేనేజర్ మాచవరం వెంకట కృష్ణారావు, స్పెక్ట్రం మర్కంటైల్స్ యజమాని వి.శ్రీనివాస్​కు మూడేళ్ల జైలు శిక్ష, 80వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. పీఎన్​బీ ప్యానెల్ వాల్యూయర్ అబ్దుల్ మన్నన్, ప్రైవేట్ వ్యక్తులు వి.వనజారెడ్డి, కోటిరెడ్డి, పి.మనోజ్ కుమార్​లకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది.

ఇదీ చదవండి:Mahesh Bank Case: మహేశ్‌బ్యాంక్‌ కేసులో కొనసాగుతున్న ప్రధాన నిందితుల వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.