ETV Bharat / city

CBI PETITION: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్

author img

By

Published : Sep 16, 2021, 11:22 PM IST

ఏపీకి చెందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో గంగిరెడ్డి బెయిల్​ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్​ దాఖలు చేసింది. ఈ మేరకు పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం బెయిల్ రద్దుచేసి కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.

CBI PETITION: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
CBI PETITION: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గంగిరెడ్డి బెయిల్​ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్​ దాఖలు చేసింది. గంగిరెడ్డి గతంలో 201 సెక్షన్ కింద అరెస్టై బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్​ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం బెయిల్ రద్దుచేసి కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.

నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కడప జైలు నుంచి ఉమాశంకర్ రెడ్డిని 4 రోజుల కస్టడీకి సీబీఐ అధికారులు తీసుకున్నారు. కస్టడీకి ముందు ఉమాశంకర్‌రెడ్డికి వైద్యపరీక్షలు చేయించాలని పులివెందుల కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ఉమాశంకర్‌రెడ్డిని విచారించాలని స్పష్టం చేసింది. ఇక వివేకా ఇంటి వాచ్​మెన్ రంగన్నను కడపలో సీబీఐ అధికారులు విచారించారు.

ఇదీ చదవండి: youth Reaction: 'చెడు వ్యసనాలే ఇలాంటి ఘటనలకు కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.