ETV Bharat / city

'తెరాస ఎమ్మెల్యే గెలిచినా పనిచేయలేని దద్దమ్మనా.. అందుకే దత్తత ప్రకటనా..?'

author img

By

Published : Oct 17, 2022, 8:04 PM IST

Laxman Comments on TRS: మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమయిందని భాజపా రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా.. ప్రజలు భాజపాకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజా పాలన గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ దిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా పని చేయలేని దద్దమ్మనా.. అందుకే కేటీఆర్ దత్తత ప్రకటన చేశారా అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు వేసిన ఓటు మూసీలో వేసినట్లే అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

laxman
laxman

Laxman Comments on TRS: సీఎం కేసీఆర్ ప్రజా పాలన గాలికి వదిలేసి దిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, భాజపా రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ఆరోపించారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమయిందని పేర్కొన్నారు. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా భాజపాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ అభ్యర్థి గెలిచినా పని చేయలేని దద్దమ్మనా.. కేసీఆర్ కుటుంబం చెప్తోన్న గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో తెరాస అప్రజాస్వామిక పనులకు పాల్పడుతూ.. భాజపా మీద దాడులకు దిగుతుందని ఆరోపించారు. చవకబారు ప్రచారం చేస్తున్న తెరాసను ప్రజలు చీదరించుకుంటున్నారని తెలిపారు. మునుగోడు దత్తత ఇప్పుడు గుర్తుకొచ్చిందా అన్న ఆయన.. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికల్లో మీరిచ్చిన ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చారా అని మండిపడ్డారు. మీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా పనిచేయలేని దద్దమ్మనా.. అందుకే కేటీఆర్ దత్తత ప్రకటన చేశారా అంటూ తెరాసపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌కు వేసిన ఓటు మూసీలో వేసినట్లే.. గట్టుప్పల్ మండలం, చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్, గొల్ల కురుమలకు నగదు బదిలీ.. చండూరు, చౌటుప్పల్‌లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల అభివృద్ధి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే సాధ్యమయిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గిరిజన బంధు పేరుతో మోసం చేయాలని చూస్తున్నారన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన భాజపాకే గిరిజన బిడ్డలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పోటీ ఉనికిని చాటుకోవడానికే అన్న ఆయన.. తెరాస, కాంగ్రెస్‌లది డూప్ ఫైట్ అని ధ్వజమెత్తారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వేసిన ఓటు మూసీలో వేసినట్లే అని ఎద్దేవా చేశారు.

కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.. దేశమంతా రాహుల్ గాంధీది కాంగ్రెస్ చోడో యాత్ర అయితే.. తెలంగాణలో మాత్రం 'కాంగ్రెస్ - తెరాస జోడోయాత్ర అని లక్ష్మణ్ విమర్శించారు. తోక పార్టీల తోక పట్టుకొని తెరాస.. కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు కార్యకర్తలూ వారి నాయకుల నిర్ణయాన్ని జీర్ణించుకోలేక భాజపాలో చేరుతున్నారని తెలిపారు. మునుగోడు ఫలితం తెరాస ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు రసాయన ఎరువులు మరింత చేరువ చేసే పని మోదీ చేస్తున్నారన్న ఆయన.. యూరియా పై కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తూ కర్షకులకు అండగా నిలుస్తోందని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.