ETV Bharat / city

అప్రమత్తంగా ఉండండి... అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

author img

By

Published : Oct 14, 2020, 5:47 AM IST

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్​ఎంసీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు.

cm kcr
cm kcr

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని సమస్త అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎస్​, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలపై మంగళవారం రాత్రి సమీక్షించారు. సీఎస్​, కలెక్టర్లతో ఫోన్​లో మాట్లాడారు.

వెంటనే జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించి... ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలివ్వాలని సీఎం తెలిపారు. జీహెచ్​ఎంసీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వర్షాల వల్ల వరదలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతుందని, చెట్లు, విద్యుత్​ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు.

తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలు, కాజ్​వేలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. సీఎస్​ సోమేశ్​ కుమార్​ మంగళవారం అర్ధరాత్రి వరకు పరిస్థితులను సమీక్షించారు.

ఇదీ చదవండి : భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.