ETV Bharat / city

Bandi Sanjay About Paddy Procurement : 'రైతులను మోసం చేసి కేంద్రంపై నెపం'

author img

By

Published : Mar 21, 2022, 7:45 AM IST

Bandi Sanjay About Paddy Procurement : తెలంగాణ సర్కార్ మోసాన్ని, కేసీఆర్ అబద్ధాలను గుర్తించిన రైతులు తెరాస నేతలపై తిరగబడతారన్న భయంతోనే కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొంటామని కేంద్రం చెబితే.. మేం ఇవ్వం అని చెప్పి.. ఇప్పుడు కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చాలా పెద్ద అబద్ధాల కోరు అని దుయ్యబట్టారు. ధాన్యం విషయంలో తప్పు ఒప్పుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay About Paddy Procurement
Bandi Sanjay About Paddy Procurement

Bandi Sanjay About Paddy Procurement : 'యాసంగిలో ధాన్యం కొంటాం.. ఎంత ఇస్తారో చెప్పమని' కేంద్రం అడగ్గా.. ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో 'ఈసారి ధాన్యం ఇవ్వబోమని' రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. తెల్లారే ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఎత్తేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనదట అంటూ డ్రామాలు మొదలుపెట్టారని.. కేసీఆర్‌ అబద్ధాలకోరని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ మోసాన్ని గుర్తించిన రైతులు తెరాస నాయకులపై తిరగబడతారన్న భయంతోనే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం విషయంలో తప్పు ఒప్పుకొని రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay Comments on CM KCR : ‘వరి వేయవద్దన్నారు. ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పలేదు. కేంద్రం రూ.100 కోట్లిస్తే భూసార పరీక్షలే చేయలేదు. వరి వేస్తే ఉరి అని రైతుల్ని భయపెట్టారు. మీ ఫాంహౌస్‌లో వరి పండించుకున్నారు. బాయిల్డ్‌ రైస్‌ను దేశంలో ఎవరూ తినడంలేదు. మీ కుటుంబం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తింటారా?’అని ప్రశ్నించారు.

Bandi Sanjay Fires on CM KCR : ‘ఇస్తానన్న ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం సేకరించలేకపోతోందని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ పార్లమెంటులో చెప్పారు. గత వానాకాలంలో 40 లక్షల టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మళ్లీ పంట అధికంగా వస్తుందని చెప్పగా.. మరో 24 లక్షల టన్నులు తీసుకుంటామని కేంద్రం లేఖ ఇచ్చింది నిజం కాదా?’అని సంజయ్‌ ప్రశ్నించారు.

షరియత్‌ చట్టం అమలుకు కుట్ర

Bandi Sanjay on Paddy Procurement : తెలంగాణలో షరియత్‌ చట్టం అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని..రజాకార్ల పాలనను కేసీఆర్‌ చూపిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే బోధన్‌లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జి చేసి కేసులు పెట్టారని విమర్శించారు. బోధన్‌లో ఈ విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆర్నెల్ల క్రితమే ఆమోదం తెలిపిందన్నారు. కిందిస్థాయి పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుంటే సీపీ వచ్చి లాఠీఛార్జి చేయించారని, రబ్బర్‌ బుల్లెట్లతో కాల్పులు జరిపించారని ఆరోపించారు. సీపీ పోలీస్‌ అధికారా?రౌడీనా? అర్థం కావట్లేదన్నారు. సీపీ తీరుపై పోలీసు అధికారుల సంఘం స్పందించాలని డిమాండ్‌ చేశారు. భైంసాలో ఏం జరిగిందో బోధన్‌లోనూ అదే జరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఎన్నికలెప్పుడైనా రావచ్చు

Bandi Sanjay on Yasangi Paddy Procurement : రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఎన్నికలెప్పుడైనా రావొచ్చని, నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన ఉత్సాహంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సంజయ్‌ పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి చేరికలకు పెద్ద ఎత్తున నాయకులు ఆసక్తిగా ఉన్నారని.. తక్షణమే జిల్లా స్థాయిలోనూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీ 25 జిల్లాల అధ్యక్షులతో ఆదివారమిక్కడ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

14 నుంచి రెండో విడత పాదయాత్ర

Bandi Sanjay on Rabi Paddy Procurement : బండి సంజయ్‌ పాదయాత్ర రెండో విడత ఆరు జిల్లాల్లో సాగనుంది. ప్రజాసంగ్రామయాత్ర ఇన్‌ఛార్జి గంగిడి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో రూట్‌మ్యాప్‌పై చర్చించారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో యాత్ర జరపాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 14న జోగులాంబ ఆలయం వద్ద ప్రారంభమయ్యే సంజయ్‌ పాదయాత్ర మే తొలివారం ఆఖరు వరకు జరగనుంది. మహేశ్వరం లేదా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్‌గల్‌లో రెండో విడత పాదయాత్ర ముగించేలా కసరత్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.