ETV Bharat / city

మైకు లాగేసుకున్న ఘటనపై స్పందించిన అసోం సీఎం.. ఏమన్నారంటే..?

author img

By

Published : Sep 10, 2022, 10:36 PM IST

Assam CM Himanta Biswasharma: హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన గణేశ్‌ శోభాయాత్రలో తన దగ్గర నుంచి మైక్‌ లాక్కున్న ఘటనపై అసోం సీఎం స్పందించారు. పార్టీ కార్యకర్తగా ఉండి ఇలా చేయడం కరెక్ట్‌ కాదన్నారు. తనపై దాడిని అతిథి దేవోభవ అనే మన సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్యాన్ని డిమాండ్‌ చేశారు.

Assam CM Himanta Biswasharma
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

Assam CM Himanta Biswasharma comments on trs: గణేశ్‌ శోభాయాత్రలో శుక్రవారం హైదరాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్‌ వద్ద జరిగిన ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. తనపై దాడి చేసేందుకు యత్నించారని.. పార్టీ కార్యకర్తగా ఉండి ఇలా చేయడం సరికాదన్నారు. నిందితుడిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘నాపై దాడి యత్నం.. అతిథి దేవోభవ అనే మన సంస్కృతికి విరుద్ధం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇదీ జరిగింది:

హైదరాబాద్‌లో శోభాయాత్ర సాఫీగా సాగుతున్న వేళ మొజంజాహీ మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా గోషామహల్‌ తెరాస నాయకుడు నందకిషోర్‌ వ్యాస్‌ బిలాల్‌ మైకు లాక్కున్నారు. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు హిమంత బిశ్వశర్మ గణేశ్‌ నిమజ్జన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాతబస్తీ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసిన తరువాత ఉత్సవ సమితి వేదికపై ప్రసంగించడానికి సిద్ధమయ్యారు.

....

అదే సమయంలో వేదికపైకి తెరాసనేత ఒక్కసారిగా వచ్చి మైకును లాక్కొని ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమితి నాయకులు వ్యాస్‌ను అడ్డుకుని దించేశారు. అక్కడికి పలువురు తెరాస కార్యకర్తలు వచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు గొడవ జరగకుండా అడ్డుకున్నారు. తీవ్ర నిరసనలు, నినాదాల మధ్య నందకిషోర్‌ను అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మిగతా నాయకులను పోలీసులు చెదరగొట్టడంతో హిమంత బిశ్వశర్మ ప్రసంగం కొనసాగించారు. అయితే, నిమజ్జన వేదికపై ఉన్న వారు తప్పుడు ప్రచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించడం తట్టుకోలేక, సహనం నశించి మైకు లాగేసుకున్నట్లు నందకిషోర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.