ETV Bharat / city

SSC Results: ఏపీ 'పది' ఫలితాలు విడుదల..సబ్జెక్టులు, ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు

author img

By

Published : Aug 6, 2021, 6:17 PM IST

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు వెల్లడించారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చామన్నారు.

ap ssc results
ap ssc results

ఏపీలో పదో తరగతి ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి ప్రతిభ ఆధారంగా సబ్జెక్టుల వారీగా.. గ్రేడ్లు ఇచ్చామన్నారు.

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా గ్రేడ్లు విభజన చేసినట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. గ్రేడ్ల వల్ల 6.26 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. ఎఫ్‌ఏకు 50 శాతం, ఎస్‌ఏకు 50 శాతం కేటాయించి గ్రేడ్లు విభజన చేశామన్నారు. గ్రేడ్ల కేటాయింపు వల్ల ఏ విద్యార్థికీ నష్టం జరగదన్నారు.

ప్రతిభావంతులకు నష్టం

కరోనా వల్ల రెండో ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేకపోయామని మంత్రి సురేశ్ అన్నారు. పరీక్షలు లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. గ్రేడ్లు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరటంతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఛాయారతన్‌ కమిటీ అన్ని విషయాలూ పరిశీలించించి గ్రేడ్లు ఇచ్చిందన్నారు.

ఇదీచూడండి: CM KCR REVIEW: నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.