ETV Bharat / city

AP Budget: నేడే ఏపీ బడ్జెట్​.. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధ్యమేనా?

author img

By

Published : Mar 11, 2022, 5:44 AM IST

AP Budget: ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రెండున్నర లక్షల కోట్లతో పద్దు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్‌ బండిని ఏనెలకానెల అప్పులతో నెట్టుకొస్తున్న ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన... పద్దులో సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా పాటిస్తారనేది ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేకు రూ.2 కోట్ల రూపాయల చొప్పున నియోజకవర్గ నిధిని ప్రతిపాదించే అవకాశం ఉందని ఈనాడు పత్రిక పేర్కొంది.

AP Budget: నేడే ఏపీ బడ్జెట్​.. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధ్యమేనా?
AP Budget: నేడే ఏపీ బడ్జెట్​.. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధ్యమేనా?

AP Budget: ఏపీ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సుమారు రూ.2.50 లక్షల కోట్ల మేర బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపుతున్నా నిధులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఈనాడు పత్రికలో ప్రచురితమైన సమాచారం మేరకు.. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపుతున్నా..నిధులు ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండిపోయాయి. గతంలోని పెండింగు బిల్లులు.. ఈ ఏడాది బడ్జెట్‌లో చూపడం లేదు. ఫలితంగా ఆ నిధులు పొందాలంటే మళ్లీ కొత్తగా బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు పొందాల్సి వస్తోంది.

అనేక ప్రభుత్వ శాఖల్లో మూలధన వ్యయం అంచనాలే తక్కువగా ఉంటే అందులోనూ ఖర్చు మరీ తీసికట్టు అవుతోంది. జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు లక్షా ,11 వేల 792 కోట్లుగా ఉన్నాయి. మిగిలిన రెండు నెలల్లో మరో రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లు రావచ్చని అంచనా. జనవరి నెలాఖరు వరకు మొత్తం ఖర్చు లక్షా 69 వేల 842 కోట్లకే పరిమితమైంది. మొత్తం రూ. 2 లక్షల 28 వేల కోట్ల బడ్జెట్‌ అంచనాల్లో దాదాపు రూ.లక్ష కోట్లు ఇతరత్రా అప్పుల రూపంలోనే తీసుకురావాల్సిన పరిస్థితి.

ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు

రాబోయే రోజుల్లో బడ్జెట్‌ స్వరూపం పెరిగితే అదనపు మొత్తాలు ఎలా తీసుకురాగలదన్నది కీలకంగా మారింది. నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్‌లో చూపే అవకాశం ఉంది. నేరుగాలబ్ధిదారులకు ఇచ్చే ప్రయోజనాల రూపంలో సుమారు రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ దిశగా ముందుకెళ్లాలంటే ఎంత లేదన్నా ఈ బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇక రాజధాని అమరావతిలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళిక ప్రకారం సౌకర్యాలు కల్పించాల్సిందేనని రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఏపీ హైకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో ఎంతమేర నిధులు కేటాయిస్తారనేది బడ్జెట్‌లో చూడాల్సి ఉంది.

వీటన్నింటికీ నిధుల సమీకరణ ఎలా?

నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్‌లో చూపనున్నారు. నేరుగా లబ్ధిదారులకు ఇచ్చే ప్రయోజనాల రూపంలో సుమారు రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఏపీఎస్‌ఐడీసీ నమూనాలో గతంలో 2020-21 బడ్జెట్‌లో రూ.18,500 కోట్ల మేర రుణాలు తెచ్చి ఈ పథకాలకు వెచ్చించారు. ఈ నమూనా సరికాదని కేంద్ర ఆర్థికశాఖ, ఫైనాన్షియల్‌ సర్వీసు విభాగమూ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ ఎలాగన్న ప్రశ్నకూ బడ్జెట్టే జవాబివ్వాల్సి ఉంటుంది. మరోవైపు మూలధన వ్యయం ఆధారంగా బహిరంగ మార్కెట్‌ రుణంలో 0.5 శాతం మేర కేంద్ర ప్రభుత్వం కోత పెడుతోంది. కేంద్రం నిర్దేశించిన ప్రకారం మూలధన వ్యయం చేయడం లేదని ఆరు నెలల తర్వాత జరిపిన సమీక్షలో తేలింది.

  • పోలవరం ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ దిశగా ముందుకెళ్లాలంటే ఎంత లేదన్నా ఈ బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు అవసరం.
  • రాజధాని అమరావతిలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రణాళిక ప్రకారం సౌకర్యాలు కల్పించాల్సిందేనని, రైతులకు ప్లాట్లు అభివృద్ధిచేసి ఇవ్వాలని హైకోర్టు గడువు విధించింది.
  • రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ నిధులు ఎలా సమకూరుస్తారో బడ్జెట్‌లో చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.