ETV Bharat / city

తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై హైకోర్టు విచారణ

author img

By

Published : Jan 21, 2022, 6:33 PM IST

తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై హైకోర్టు విచారణ
తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై హైకోర్టు విచారణ

ttd board members case: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. 82 మందితో తితిదే పాలకమండలిని ఎలా నియమిస్తారని పిటిషనర్​ తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. జంబో క్యాబినెట్​ను తలపిస్తుందని వాదించారు. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరగా.. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

ttd board members case: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియమాకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓలను గతంలోనే హైకోర్టు సస్పెండ్‌ చేసిందని.. చట్టంలో సవరణ తీసుకువచ్చి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

పిటిషనర్ తరపు న్యాయవాదులు యలమంజుల బాలాజీ, అశ్వినీ కుమార్​లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 82 మందితో తితిదే పాలకమండలిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జంబో క్యాబినెట్​ను తలపిస్తుందని వాదించారు. జీఓలను రద్దు చేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు కోరారు. చట్ట సవరణకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాలు సమయం కోరారు. తదుపరి కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.