ETV Bharat / city

అన్​లోడింగ్ కోసం ఎదురుచూస్తున్న 'అమ్మోనియం నైట్రేట్' నౌకలు

author img

By

Published : Oct 6, 2020, 11:43 PM IST

ammonium-nitrate-ships-waiting-for-unloading-in-visakha-port
అన్​లోడింగ్ కోసం ఎదురుచూస్తున్న 'అమ్మోనియం నైట్రేట్' నౌకలు

అమ్మోనియం నైట్రేట్​ను తీసుకువచ్చిన మూడు నౌకలు అన్​లోడింగ్ కోసం ఎదురుచూస్తున్నాయని.. విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు తెలిపారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఈ విషయాన్ని తెలియజేశామని చెప్పారు.

విశాఖ పోర్టుకు అమ్మోనియం నైట్రేట్​ను తీసుకువచ్చిన మూడు నౌకలు అన్​లోడింగ్ కోసం ఎదురుచూస్తున్నాయని.. పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు వెల్లడించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఈ విషయాన్ని తెలియజేశామని, ప్రస్తుతం వీటి నిల్వకు సంబంధించిన అనుమతులు ఎవరికి ఇవ్వకపోవడం వల్ల వేచి ఉండాల్సిన పరిస్దితి నెలకొందన్నారు.

వాస్తవంగా ఇప్పుడు వచ్చిన 3 నౌకల అమ్మోనియం నైట్రేట్... కేవలం ఎరువుల గ్రేడ్​కి సంబంధించినదని వివరించారు. ఎవరైతే దీనిని దిగుమతి చేసుకున్నారో.. నేరుగా నౌకనుంచి వారి గమ్యానికే రహదారి మార్గం ద్వారా పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని రామ్మోహనరావు వివరించారు.

ఇవీ చూడండి: 'లేపాక్షి నంది బ్రాండ్​కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే వాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.