ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 3,986 కరోనా కేసులు

author img

By

Published : Oct 18, 2020, 7:28 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గడిచిన 24గంటల్లో 3,986 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,132కు చేరింది.

Breaking News

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74,945 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,986 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 23 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,132కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,429 మంది బాధితులు కోవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 4,591 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,40,229కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,474 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది.

ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 70,66,203 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం, విశాఖలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసులు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.