ETV Bharat / business

ట్రంప్ చెప్పడం వల్లే మస్క్ ట్విట్టర్​ను కొన్నారా?

author img

By

Published : May 7, 2022, 8:51 PM IST

Elon Musk Trump
ట్రంప్ చెప్పడం వల్లే మస్క్ టిటర్​ను కొన్నారా?

ట్రంప్‌ సొంత సోషల్‌మీడియా సంస్థ 'ట్రూత్‌ సోషల్‌' కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌ను కొనాలని మస్క్‌కు ట్రంప్‌ చెప్పారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రూత్​ సోషల్​ చేసిన వ్యాఖ్యలపై మస్క్ స్పందించారు.

Elon Musk Trump: సాంకేతికత రంగంలోనే సంచలనంగా మారిన ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంత సోషల్‌మీడియా సంస్థ 'ట్రూత్‌ సోషల్‌' కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌ను కొనాలని మస్క్‌కు ట్రంప్‌ చెప్పారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను మస్క్‌ ఖండించారు. ఈ విషయంపై తానెప్పుడూ ట్రంప్‌తో మాట్లాడలేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే..

Truth Social: ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ సీఈఓ డేవిన్‌ న్యూన్స్‌ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ట్విటర్‌ కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. 'ట్విటర్‌ను కొనుగోలు చేయాలంటూ ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ సూచించారు' అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఓ కథనాన్ని న్యూయార్క్‌ పోస్ట్‌ ప్రచురింది. దీంతో ఎలాన్‌ మస్క్‌ దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఇది పూర్తిగా అవాస్తవం. ట్రంప్‌తో ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ నేను ఎప్పుడూ మాట్లాడలేదు' అని తెలిపారు.

Donald Trump News: 2021 జనవరి 6న అమెరికాలోని క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించింది. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ట్రంప్‌ చేస్తోన్న న్యాయపోరాటం కొనసాగుతోంది. మరోవైపు, ట్విటర్‌కు పోటీగా ట్రంప్‌ సొంతంగా ‘ట్రూత్‌ సోషల్‌’ పేరుతో సోషల్‌ మీడియా యాప్‌ను ప్రారంభించారు.

ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్‌ మస్క్‌ ఒప్పందం చేసుకున్న తర్వాత ట్రంప్‌ను తిరిగి ఈ సోషల్‌మీడియాలోకి తీసుకొస్తారంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ట్రంప్‌ స్పందిస్తూ.. 'వ్యక్తిగతంగా నాకు మస్క్‌ అంటే చాలా ఇష్టం. అయితే నా పట్ల ట్విటర్‌ ప్రవర్తించిన తీరు పట్ల నేను అసంతృప్తి చెందాను. ఒకవేళ నన్ను ట్విటర్‌లోకి అనుమతించినా నేను మాత్రం రాను' అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఫైవ్​స్టార్​ హోటల్లో భారీ పేలుడు.. 22 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.