ETV Bharat / business

ఉబర్​ యాప్​లో బగ్.. ఫ్రీగా రైడ్స్.. చాట్​జీపీటీ యూజర్ల డేటా లీక్

author img

By

Published : Mar 26, 2023, 2:07 PM IST

ఎలాంటి రుసుం చెల్లించకుండానే ఉబర్​లో ప్రయాణించే వీలు కలిగింది. ఇదంతా సాంకేతిక లోపం వల్ల జరిగింది. ఓ ఎథికల్ హ్యాకర్ దీని గురించి ఉబర్​కు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, ఓ బగ్ కారణంగా చాట్​జీపీటీ యూజర్ల డేటా లీక్ అయింది.

BUG CHATGPT UBER FREE RIDE
BUG CHATGPT UBER FREE RIDE

ఉబర్​లో సాంకేతిక లోపం తలెత్తింది. దీని వల్ల యూజర్లు ఎలాంటి రుసుం చెల్లించకుండానే క్యాబ్​లలో ప్రయాణించే అవకాశం కలిగింది. సాంకేతిక లోపాన్ని ఓ భారతీయుడు గుర్తించే వరకు ఉబర్​కు అసలు ఈ బగ్ గురించి తెలియలేదు. ఓ హ్యాకింగ్ సంస్థ ఫౌండర్ అయిన ప్రకాశ్ అనే వ్యక్తి దీనిపై 2017లోనే ఉబర్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. "ఈ బగ్​ను ఆసరాగా చేసుకొని భారత్, అమెరికాలో అనేకసార్లు ఫ్రీగా ప్రయాణించా. ఉబర్​లో రైడ్ బుక్ చేసిన తర్వాత పేమెంట్ సమయంలో.. ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే సరిపోతుంది. పేమెంట్ మధ్యలోనే ఆగిపోయి.. రైడ్ బుక్ అయినట్లు చూపిస్తుంది. ఫ్రీగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. రుజువు కోసం నేను వీడియో కూడా తీశాను. పేమెంట్ మెథడ్​లో 'abc' లేదా 'xyz' వంటి అక్షరాలు టైప్ చేస్తే చాలు. మన రైడ్​కు బిల్ రాదు" అని ప్రకాశ్ తన లింక్డ్​ఇన్​ పోస్ట్​లో వివరించారు.

ఇంత పెద్ద సాంకేతిక లోపాన్ని ఉబర్ టీమ్ ఎలా గుర్తించలేకపోయిందనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే, బగ్​ను గుర్తించి రిపోర్ట్ చేసిన ఎథికల్ హ్యాకర్ ప్రకాశ్​కు ఆ సంస్థ భారీ నజరానా ప్రకటించింది. ప్రకాశ్​కు రూ.4.6 లక్షల రివార్డ్ అందించినట్లు తెలుస్తోంది. ఈ బగ్​ను గుర్తించకపోతే.. చాలా మంది యూజర్లు ఫ్రీగా ఉబర్​ను వాడుకునేవారు. దీంతో ఆ సంస్థకు నష్టాలు తప్పేవి కావు.

చాట్​జీపీటీ యూజర్ల డేటా లీక్
మరోవైపు, చాట్​జీపీటీలోనూ ఓ సాంకేతిక లోపం బయటపడింది. కొందరు యూజర్ల పేమెంట్ వివరాలను చాట్​జీపీటీ బహిర్గతం చేసింది. వారి సెర్చ్ హిస్టరీ వివరాలు వేరే యూజర్లకు కనిపించాయని చాట్​జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ వెల్లడించింది. చాట్​జీపీటీని సబ్​స్క్రైబ్ చేసుకున్న యూజర్ల పేమెంట్ వివరాలు సైతం బయటపడి ఉండొచ్చని పేర్కొంది. వ్యక్తిగత సమాచారంతో పాటు క్రెడిట్ కార్డుల చివరి 4 అంకెలు ఇతరులకు కనిపించాయని తెలిపింది. అయితే, ఇప్పుడు ఆ బగ్​ను తొలగించినట్లు వెల్లడించింది. ఇటీవల చాట్​జీపీటీని స్వల్ప కాలం పాటు నిలిపివేసిన ఓపెన్ఏఐ.. ఈ సమయంలో సాంకేతిక లోపాన్ని సరిచేసినట్లు తెలుస్తోంది.

'దీనిపై పూర్తిగా విచారణ చేప్టటాం. 9 గంటల వ్యవధిలో చాట్​జీపీటీ ప్లస్ సబ్​స్క్రైబర్లలోని 1.2 శాతం మంది వివరాలు అనుకోకుండా బయటకు వచ్చాయి. యూజర్ల వివరాలు మరో ఇతర యూజర్లకు కనిపించాయి. పేర్లు, మెయిల్ ఐడీలు, క్రెడిట్ కార్డ్ చివరి నాలుగు అంకెలు, శాశ్వత చిరునామా, క్రెడిట్ కార్డ్ ఎక్స్​పైరీ డేట్ కనిపించాయి. క్రెడిట్ కార్డ్ అన్ని నెంబర్లూ ఏ దశలోనూ బయటకు రాలేదు' అని ఓపెన్ఏఐ వెల్లడించింది. సంబంధిత యూజర్లకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.