ETV Bharat / business

యోగి, కోహ్లీ, షారుక్​కు ఎలాన్​ మస్క్ షాక్.. ట్విట్టర్​లో అవి మాయం

author img

By

Published : Apr 21, 2023, 8:18 AM IST

Updated : Apr 21, 2023, 8:47 AM IST

Twitter blue tick removed : ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగిపోయింది. నిజమైన సెలబ్రిటీలను గుర్తించేందుకు ఉపయోగపడే వెరిఫికేషన్ మార్క్​ను.. ట్విట్టర్ తొలగించింది. ఆయా యూజర్లు సబ్​స్క్రిప్షన్ చెల్లించకపోవడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

twitter blue tick removed
twitter blue tick removed

దేశంలోని పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ట్విట్టర్​లో బ్లూటిక్ కోల్పోయారు. అనేక హైప్రొఫైల్ ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది ట్విట్టర్. నిజమైన సెలబ్రిటీల ఖాతాలను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ బ్లూటిక్​ను.. నెలవారీ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారికే కేటాయిస్తోంది ట్విట్టర్. సాధారణ యూజర్లు సైతం బ్లూటిక్ పొందేలా సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు రూపొందించింది. డబ్బులు చెల్లించనివారికి తాజాగా టిక్ మార్క్​ను తొలగించింది. అమెరికాలోని కాలిఫోర్నియా కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం టిక్ మార్క్​ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ బ్లూటిక్ కోల్పోయిన హైప్రొఫైల్ యూజర్లలో పాప్ గాయని బియాన్సే, పోప్ ఫ్రాన్సిస్, వ్యాఖ్యాత ఓప్రా విన్​ఫ్రే, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి వారి ఖాతాలు ఉన్నాయి. భారత్​లోనూ అనేక ట్విట్టర్ ఖాతాలకు బ్లూటిక్ తొలగిపోయింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్; యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాలకు సైతం వెరిఫికేషన్ మార్క్ కనిపించడం లేదు.

'వారికి నేనే డబ్బు కడుతున్నా'
అయితే, కొందరు ప్రముఖులకు బ్లూటిక్ ఉండటం చర్చనీయాంశమైంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబ్రాన్, రచయిత స్టీఫెన్ కింగ్, నటుడు విలియం షాట్నర్ వంటి వారు గతంలో ట్విట్టర్ సబ్​స్క్రిప్షన్ తీసుకోవడానికి నిరాకరించారు. సబ్​స్క్రిప్షన్ చెల్లించబోమని చెప్పారు. కానీ, వీరి ఖాతాలకు ప్రస్తుతం టిక్ మార్క్ కొనసాగుతోంది. వెరిఫికేషన్ మార్క్​పై క్లిక్ చేస్తే.. ఈ యూజర్లు సబ్​స్క్రిప్షన్ చెల్లించారని వస్తోంది. ఈ నేపథ్యంలో తాను ట్విట్టర్ బ్లూ సబ్​స్క్రిప్షన్ తీసుకోలేదని స్టీఫెన్ కింగ్ ట్వీట్ చేశారు. 'ట్విట్టర్ బ్లూ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నానని నా ఖాతా చెబుతోంది. నేను తీసుకోలేదు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఖాతా సూచిస్తోంది. నేను అది చేయలేదు. మీకు తెలియాలి కాబట్టి చెబుతున్నా' అని కింగ్ వివరణ ఇస్తూ రెండు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. తొలి ట్వీట్​కు.. 'యూఆర్ వెల్​కమ్ నమస్తే' అని బదులిచ్చిన మస్క్.. కొందరి ఖాతాలకు తానే వ్యక్తిగతంగా సబ్​స్క్రిప్షన్ చెల్లిస్తున్నట్లు మరో ట్వీట్​లో చెప్పుకొచ్చారు.

ఛార్జీలు ఎంత?
అమెరికా యూజర్లైతే ట్విట్టర్ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. సంస్థల ఖాతాల కోసమైతే నెలకు 1000 డాలర్లు కట్టాల్సి ఉంటుంది. ఆ కంపెనీల అనుబంధ ఖాతాలు, ఉద్యోగుల ఖాతాలకూ వెరిఫికేషన్ కావాలనుకుంటే.. ఒక్కో అకౌంట్​కు నెలకు 50 డాలర్ల చొప్పున అదనంగా చెల్లించాలి.

ట్విట్టర్​లో దాదాపు 3 లక్షల మంది ఖాతాలకు ఒరిజినల్ బ్లూ-చెక్ సిస్టమ్ ద్వారా బ్లూటిక్ కేటాయించారు. నిజమైన సెలబ్రిటీలను వెరిఫై చేసి ఈ టిక్ మార్క్ ఇచ్చేవారు. దీంతో, జర్నలిస్టులు, రాజకీయ నేతలు, అథ్లెట్లు, పబ్లిక్ ఫిగర్లను సులభంగా గుర్తించేందుకు ఈ వెరిఫికేషన్ ఉపయోగపడేది. కానీ, ప్రస్తుతం ఆ ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నెంబర్​తో వెరిఫికేషన్ పూర్తి చేసి, సబ్​స్క్రిప్షన్ పొందితే.. బ్లూటిక్ కేటాయిస్తున్నారు. ఈ ప్రక్రియలో.. ఆ వ్యక్తికి రిజిస్టర్ అయిన నెంబర్​కు యాక్సెస్ ఉంటుందని తెలుస్తుందే తప్ప.. వారి నిజమైన ఐడెంటిటీ నిర్ధరణ కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

Last Updated : Apr 21, 2023, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.